రీసెంట్‌గా ‘శ్వాగ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన శ్రీవిష్ణు.. ఇప్పుడు తన నెక్స్ట్ మూవీపై ఫోకస్ పెట్టాడు. బెల్లంకొండ గణేష్ ఫస్ట్ మూవీ ‘స్వాతిముత్యం’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన లక్ష్మణ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నట్టు తెలుస్తోంది. శ్రీవిష్ణుకు కలిసొచ్చిన ఫన్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో లక్ష్మణ్ స్టోరీ రెడీ చేశాడని, అది విష్ణుకు బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
ఇప్పటికే స్క్రిప్టుకు సంబంధించిన పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.