రివ్యూ: శ్రీకారం

రివ్యూ: శ్రీకారం

రివ్యూ: శ్రీకారం
రన్ టైమ్: 2 గంటలు
నటీనటులు: శర్వానంద్,ప్రియాంక అరుల్ మోహన్,రావు రమేష్,ఆమని, సాయి కుమార్,నరేష్,సత్య,సప్తగిరి తదితరులు
సినిమాటోగ్రఫీ: యువరాజ్
మ్యూజిక్ : మిక్కీ జె మేయర్
నిర్మాతలు: రామ్ ఆచంట,గోపి ఆచంట
రచన,దర్శకత్వం: కిషోర్
రిలీజ్ డేట్: మార్చి 11,2021

కథేంటి:?
కార్తీక్ (శర్వానంద్) హైదరాబాద్ లో మంచి సాఫ్ట్ వేర్ ఉద్యోగి. అన్ని ఉన్నా కానీ ఊరి మీద,వ్యవసాయం మీద మక్కువ ఎక్కువ. తండ్రి కేశవులు (రావు రమేష్) కు చేదోడు వాదోడుగా ఉందామనుకుని జాబ్ వదిలేసి ఊరొస్తాడు. అది తన తండ్రికి ఇష్టం ఉండదు.అయినా సరే హైదరాబాద్ లో సెటిల్ అయిన వారిని అందరినీ ఊరికి పిలిచి ఉమ్మడి వ్యవసాయం అని స్టార్ట్ చేస్తాడు. దాంట్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నాడు.తండ్రిని ఎలా ఒప్పించాడు? యువతకు ఎలాంటి సందేశం ఇచ్చాడన్నదే స్టోరి.


నటీనటుల పర్ఫార్మెన్స్:


శర్వానంద్ మెచ్యుర్డ్ పర్ఫార్మెన్స్ అందించాడు. ఇలాంటి సబ్జెక్ట్ ఎంచుకున్నందుకు అతన్ని ఆభినందించాల్సిందే. ప్రియాంక మోహన్ అందం,అభినయం తో ఆకట్టుకుంది.తండ్రి పాత్ర చేసిన రావు రమేష్ కు కెరీర్ లో చెప్పుకునే మంచి పాత్ర దక్కింది.ఆయన ఎప్పటిలాగే ఆ పాత్రలో ఒదిగిపోయి నటించారు.సాయి కుమార్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించారు.నరేష్ ,ఆమని,సత్య తదితరులు తమకు అలవాటైన పాత్రల్లో రాణించారు.


టెక్నికల్ వర్క్:


యువరాజ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఊరి అందాలను, పొలం లొకేషన్లను అద్భుతంగా చూపించారు. మిక్కి జే మేయర్ ఇచ్చిన పాటల్లో ఒకటి బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాను ఎలివేట్ చేసింది. ఎడిటింగ్ క్రిస్ప్ గా ఉంది. ఆర్ట్ వర్క్ బాగుంది.ప్రొడక్షన్ వాల్యూయ్స్ రిచ్ గా ఉన్నాయి. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ చాలా బాగున్నాయి.

విశ్లేషణ:
‘‘శ్రీకారం’’ డీసెంట్ సినిమా. వ్యవసాయం గొప్పతనం గురించి చెప్పే సినిమా. యూత్ ను ఇన్ స్పైర్ చేస్తుంది. ఫ్చూచర్లో రైతులు కరువవుతున్నారు. ఇప్పుడున్నవాళ్లే ఆ రంగం వైపు దృష్టి పెట్టాలని ఓ ఆలోచన కలిగిస్తుంది. వ్యవసాయం బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్లకు బాగా కనెక్టవుతుంది సినిమా.శర్వానంద్ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు ప్లస్.అలాగే రావు రమేష్ రైతు పాత్ర కూడా కట్టిపడేస్తుంది.ఫస్టాఫ్ ఓకే అనిపించినా.. సెకండాప్ గ్రిప్పింగ్ గా సాగుతుందవి.ఆ కథ చుట్టూ అల్లుకున్న డ్రామా కూడా మెప్పిస్తుంది. తక్కువ నిడివి ఈ సినిమాకు ప్లస్.క్లైమక్స్ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతంది. ఓవరాల్ గా మంచి ప్రయత్నం. ప్యామిలీతో కలిసి చూడొచ్చు.
బాటమ్ లైన్: కొత్త ఆలోచనకు ‘‘శ్రీకారం’’