
దగ్గుబాటి (Daggubati) వారింట పెళ్లి సందడి షూరూ అయింది. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ (Daggubati Suresh) రెండో కొడుకు దగ్గుబాటి అభిరామ్ (Daggubati Abhiram)పెళ్లి ఇవాళ డిసెంబర్ 6న శ్రీలంకలోని అనంతర కలుతార అనే 5 స్టార్ హోటల్లో ప్రత్యూష అనే అమ్మాయి మెడలో మూడు ముళ్లతో ఒక్కటవ్వబోతున్నారు.
ఇవాళ (డిసెంబర్ 6న) రాత్రి 8.50 గంటలకు జరగబోయే వీరి పెళ్ళికి..దాదాపు 200 మంది పైగా అటెండ్ అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే..అసలు శ్రీలీల(Sreeleela) ఎందుకు వెళ్లనుందంటే? దగ్గుబాటి అభిరామ్ ఇంట అడుగుపెట్టనున్న పెళ్లి కూతురు ప్రత్యూష..బ్యూటీ శ్రీలీల ఇద్దరు చిన్ననాటి స్నేహితులట.
అమెరికాలో చదువుకున్నప్పుడు వీరిద్దరూ క్లాస్ మేట్స్ని సమాచారం. అందుకే తన బెస్టీ అయిన ప్రత్యుష పెళ్లికి అటెండ్ అవ్వడానికి శ్రీలంక వెళ్లనుందట. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కువ డిమాండ్ ఉన్న హీరోయిన్ శ్రీలీల. ఈ బ్యూటీ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది..ఇలాంటి బిజీ షూటింగ్స్లో ఉన్నా..బెస్ట్ ఫ్రెండ్ పెళ్లికి కోసం వెళ్లనుందట. దగ్గుబాటి ఫ్యామిలీలో అడుగు పెట్టబోతున్న కోడలు ప్రత్యూష చాపరాల సురేష్‌బాబు కుటుంబానికి చెందిన అమ్మాయే. ప్రకాశం జిల్లాలోని కారంచేడు సొంత ఊరు. సురేష్‌బాబుకు ఆ అమ్మాయి మేనకోడలు అవుతుంది.
ఇక అభిరామ్ విషయానికి వస్తే..రీసెంట్గా ఆయన హీరోగా వచ్చిన అహింస సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు తేజ తెరకెక్కించిన ఈ సినిమా ఆడియన్స్ ను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో మొదటి సినిమాతోనే పరాజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు అభిరామ్. ప్రస్తుతం తన రెండో సినిమాను సెట్ చేసుకునే పనిలో ఉన్నాడు ఈ యంగ్ హీరో.