తెలుగు బుల్లితెరపై శ్రీముఖి(Sreemukhi) చేసే సందడి మామూలుగా ఉండదు. షో ఏదైనా యాంకర్ గా ఆమె ఉండాల్సిందే. అడపాదడపా సినిమాలు కూడా చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటారు. తన లేటెస్ట్ ఫోటో షూట్స్, షోస్ కు సంబందించిన విషయాలను తన ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటారు.
తాజాగా ఈ అల్లరి యాంకరమ్మ తన యూట్యూబ్ ఛానల్ లో ఓ వీడియో అప్లోడ్ చేశారు. ఈ వీడియోలో తాను తన ఫ్యామిలీతో జరుపుకున్న దీపావళి(Diwali) సెలెబ్రేషన్స్ ని చూపించారు. అయితే దీపావళి సందర్భంగా శ్రీముఖి తన పేరెంట్స్ కు కాస్ట్ లీ గిఫ్ట్స్ ఇచ్చారు. తండ్రికి బంగారు చైన్, తల్లికి డైమండ్ నెక్లస్ గిఫ్ట్ గా ఇచ్చారు. అవి చూసి శ్రీముఖి పేరెంట్స్ ఆశ్చర్యపోతూ.. ఆనందం వ్యక్తం చేశారు.
అనంతరం శ్రీముఖి మాట్లాడుతూ.. ఒకప్పుడు మాది మధ్య తరగతి కుటుంబం. అందరం ఒకే గదిలో ఉండేవాళ్ళం. ఆ స్థాయి నుండి.. కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కుతూ.. ఇవాళ ఇంత పెద్ద ఇంట్లో దీపావళి పండుగ చేసుకుంటున్నాము. దీనికి కారణం మా పేరెంట్స్. మాకు ఇంత మంచి జీవితాన్ని ఇచ్చిన వీరికి ఈ చిన్న గిఫ్ట్స్ ఇస్తున్నాం.. అంటూ తల్లితండ్రుల కళ్ళు మొక్కి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. శ్రీముఖి, ఆమె తమ్ముడు శుశ్రుత్. ప్రస్తుతం శ్రీముఖి చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
