కచ్చితంగా పెళ్లి చేసుకుంటా!

కచ్చితంగా  పెళ్లి చేసుకుంటా!

టాకీస్: తనదైన మాటలు, డ్యాన్స్ తో యాంకరింగ్ లో గుర్తింపు సంపాదించుకుంది శ్రీముఖి. ఇక సోషల్ మీడియాలో అమ్మడు అందాల ఆరబోత అంతా ఇంతా కాదు. ఇక ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ 30 ఏళ్లు ఎప్పుడో దాటేసింది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అందాల ఆరబోతతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఇక ఈ మధ్య ఎక్కడ చూసినా అమ్మడి పెళ్లి గురించే ప్రస్తావన నడుస్తుంది.

ఇటీవల ఇన్ స్టాలో తన అభిమానులతో ముచ్చటించింది.  ‘శ్రీముఖి గారు మీరు ఎప్పుడైనా ప్రేమలో విఫలమయ్యారా..?’ అని అడగగా దానికి శ్రీముఖి నిర్మొహమాటంగా ” ఓ బొచ్చెడు సార్లు” అంటూ చెప్పింది. పెళ్లి తర్వాత మీరు యాంకరింగ్ మానేస్తారా అన్న ప్రశ్నకు మానను అంటూ సమాధానం ఇచ్చింది. ‘కచ్చితంగా పెళ్లి అయితే చేసుకుంటానని మాటిస్తున్నాను’ అని చెప్పింది.  కొన్ని రోజులుగా శ్రీముఖి ఒక బిజినెస్ మేన్ తో ప్రేమలో ఉందని వార్తలు వినిపించాయి. మరి అతనితోనే ఆమె పెళ్లి ఉండబోతుందా..? లేక పెద్దలు కుదిరిచిన పెళ్లా అనేది తెలియాల్సి ఉంది.