ఒకవేళ తాను కోహ్లీ కెప్టెన్సీలో ఆడి ఉంటే ఇండియా మరో మూడు ప్రపంచకప్‌లు గెలిచేదంటూ కామెంట్స్ చేశాడు టీంమిండియా మాజీ ఆటగాడు శ్రీశాంత్. క్రిక్‌చాట్ అనే షోలో శ్రీశాంత్ ఈ కామెంట్స్ చేశాడు. ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాక కోహ్లీ 2017లో జట్టు బాధ్యతలను తీసుకున్నాడు. కోహ్లీ కెప్టెన్సీలో టీంమిండియా 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే ప్రపంచకప్, 2021 టెస్టు ఛాంపియన్‌షిప్, 2021 టీ20 ప్రపంచకప్ వంటి మెగా టోర్నీల్లో ఆడింది. అయితే ఒక్కదాంట్లో కూడా విజేతగా నిలవలేకపోయింది.
ఈ నేపథ్యంలో కోహ్లీ కెప్టెన్సీలో ఒకవేళ తాను ఆడి ఉంటే ఇండియా 2015, 2019, 2021 ట్రోఫీలను గెలిచేదిని శ్రీశాంత్ అన్నాడు. ఇక 2011 వన్డే ప్రపంచకప్ సచిన్ కోసమే గెలిచామని శ్రీశాంత్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాడు. కాగా ధోనీ కెప్టెన్సీలో టీంమిండియా రెండు ప్రపంచకప్‌లు గెలుచుకోగా అందులో శ్రీశాంత్ సభ్యుడిగా ఉన్నాడు. 2013 ఐపీఎల్ లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో ఆటకు దూరం అయ్యాడు. ఈ ఏడాది మార్చిలో క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
