SRH Batting: పంజాబ్ బౌలర్లపై అభిషేక్, హెడ్ దండయాత్ర.. పవర్ ప్లేలోనే అత్యధిక రన్స్ చేసిన SRH

SRH Batting: పంజాబ్ బౌలర్లపై అభిషేక్, హెడ్ దండయాత్ర.. పవర్ ప్లేలోనే అత్యధిక రన్స్ చేసిన SRH

SRH Batting: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో భాగంగా ముల్లన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న కీలక పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు వైల్డ్ ఫైర్ బ్యాటింగ్ చేస్తుంది. మొదటి ఓవర్ నుంచే దూకుడైన బ్యాటింగ్ తో పంజాబ్ బౌలర్లపై దండయాత్ర స్టార్ట్ చేశారు.  ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ బ్యాటింగ్ కి వైశాక్ విజయ్ కుమార్, అర్షదీప్ సింగ్, జేవియర్ బార్ట్‌లెట్, మార్కో యాన్సెన్ లు బెంబేలెత్తిపోయారు. ఈ నేపథ్యంలో కేవలం 6 ఓవర్లలోనే ఈ సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా రికార్డు నెలకొల్పింది.

IPL చరిత్రలో అత్యధిక పవర్‌ప్లే స్కోరు 125/0, ఇది 2024, ఏప్రిల్ 20వ తేదీన ఢిల్లీ క్యాపిటల్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) సాధించింది. ఈ రికార్డు ప్రదర్శన మ్యాచ్‌లోని మొదటి ఆరు ఓవర్లలోనే నమోదైంది. ఇది, ఆ సీజన్‌లో అంతకుముందు SRH పేరుపై ఉన్న 107/0 పేరుపై ఉన్న అత్యుత్తమ రికార్డును అధిగమించింది. ఇప్పుడు ఐపీఎల్ లో పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసిన జట్ల వివరాలు తెలుసుకుందాం.. 

IPL చరిత్రలో అత్యధిక పవర్‌ప్లే స్కోర్లు:
* 125/0 - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ఢిల్లీ క్యాపిటల్స్, 2024
* 107/0 - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్, 2024
* 105/0 సన్‌రైజర్స్ హైదరాబాద్ vs పంజాబ్ కింగ్స్, 2026
* 105/0 - కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, 2017
* 100/2 - చెన్నై సూపర్ కింగ్స్ vs కింగ్స్ XI పంజాబ్, 2014
* 97/1 - రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, 2026