
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో సోమవారం ( నవంబర్ 20) శ్రీ కాలభైరవ హోమం ఘనంగా జరిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నవంబరు 14 నుండి డిసెంబరు 12వ తేదీ వరకు హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా యాగశాలలో సోమవారం నవంబర్ 20న ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12గంటల వరకు పూజ, అష్టభైరవ హోమం, మహా పూర్ణాహుతి, మహాశాంతి అభిషేకం, శ్రీకాలభైరవ మూలవర్లకు కలశాభిషేకం, హారతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు, ఏఈవో సుబ్బరాజు, సూపరింటెండెంట్ భూపతి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు రవికుమార్, బాలకృష్ణ, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు. నవంబరు 21వ తేదీ మంగళవారం నవగ్రహ హోమం జరుగనుందని ఆలయ అధికారులు తెలిపారు.