
నెట్ వర్క్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. భక్తులు ఉదయమే ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో , మెట్పల్లి లో శ్రీ మురళీకృష్ణ దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. స్వామి వారికి పంచామృతాభిషేకం, నగర సంకీర్తన, పల్లకి సేవ, ఉట్టి కొట్టడం, విశేషా లక్ష పుష్పార్చన జరిపారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.
కోనరావుపేట మండలంలోని ధర్మారం లో శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ పట్టణంలో సకల కళ సాంస్కృతిక సంఘం, ప్రవీణ్ సల్వాజి మ్యూజికల్ గ్రూప్ సంయుక్త నిర్వహణలో కృష్ణ జన్మాష్టమి వేడుకలను స్థానిక కళాభారతి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హాజరై పోటీలను తిలకించారు. విజేతలకు బహుమతులు ప్రశంసాపత్రాలు అందజేశారు. చొప్పదండిలో ఉట్టి కొట్టే వేడుకును చిన్నారులు సంబరంగా జరుపుకున్నారు.