మూడో టీ20లో భారత బౌలర్లు చెలరేగారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక తక్కువ స్కోర్ కే పరిమితమైంది. ప్రారంభంలోనే వికెట్లు కోల్పోయిన శ్రీలంక జట్టు పేక మేడలా కూలుతూ వచ్చింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 146 రన్స్ మాత్రమే చేసింది. లంక కెప్టెన్ శనక (29 బంతుల్లో 51 7 ఫోర్లు) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ కెప్టెన్స్ ఇన్నింగ్స్ ఆడాడు. రెండో టీ20లోనూ ఆఖర్లో మెరుపులు మెపిరించిన శనక ఈ మ్యాచ్‌లోనూ అద్భుతమైన పోరాట పటిమ కనబర్చి హాఫ్ సెంచరీ బాదాడు. ఫలితంగా శ్రీలంక ఈ మాత్రం స్కోర్ చేయగలిగింది.
టీమిండియా బౌలర్లలో ఆవేశ్ ఖాన్ 2, సిరాజ్, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు.
Dasun Shanaka's brilliant knock of 74* helps Sri Lanka to a total of 146/5 ?
— ICC (@ICC) February 27, 2022
Can the visitors defend this? #INDvSL | ? https://t.co/x2kKwnfVnk pic.twitter.com/CKNE57Dy7Z
