రెండో టెస్టులో గెలుపు ముంగిట లంక

రెండో టెస్టులో  గెలుపు ముంగిట లంక

చట్టోగ్రామ్ (బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌): బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  రెండో టెస్టులో విజయానికి  శ్రీలంక మూడు వికెట్ల దూరంలో నిలిచింది. లంక ఇచ్చిన 511 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నాలుగో రోజు, మంగళవారం ఆటను ఆతిథ్య బంగ్లా 268/ 7తో ముగించింది.  మోమినుల్ హక్ (50) ఫిఫ్టీతో రాణించగా.. లిటన్ దాస్ (38), షకీబ్ అల్ హసన్ (36) కాసేపు పోరాడారు. 


ప్రస్తుతం మెహిదీ హసన్ మిరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (44 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), తైజుల్ ఇస్లాం (10 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) క్రీజులో ఉన్నారు. లంక బౌలర్లలో లాహిరు కుమార, ప్రబాత్, కమిందు మెండిస్ తలో రెండు వికెట్లు తీశారు. లంక విజయానికి మరో మూడు వికెట్లు అవసరం కాగా, బంగ్లాకు 243 రన్స్ కావాలి. అంతకుముందు ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నైట్ స్కోరు 102/6తో ఆట కొనసాగించిన లంక రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను 157/7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది.