పాక్పై 5 వికెట్ల తేడాతో శ్రీలంక విజయం

పాక్పై 5 వికెట్ల తేడాతో శ్రీలంక విజయం

దుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌: ఆసియా కప్‌‌‌‌ ఫైనల్‌‌‌‌కు డ్రెస్‌‌‌‌ రిహార్సల్‌‌‌‌గా సాగిన సూపర్‌‌‌‌–4 ఆఖరి మ్యాచ్‌‌‌‌లో శ్రీలంక పైచేయి సాధించింది. బ్యాటింగ్‌‌‌‌లో పాథూమ్‌‌‌‌ నిశాంక (48 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 55 నాటౌట్‌‌‌‌), బౌలింగ్‌‌‌‌లో హసరంగ (3/21) రాణించడంతో.. శుక్రవారం జరిగిన మ్యాచ్‌‌‌‌లో లంక 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌‌‌‌ను ఓడించింది. టాస్‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌కు దిగిన పాక్‌‌‌‌ 19.1 ఓవర్లలో 121 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. కెప్టెన్‌‌‌‌ బాబర్‌‌‌‌ ఆజమ్‌‌‌‌ (30) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌. స్టార్టింగ్‌‌‌‌ నుంచే లంక స్పిన్‌‌‌‌ త్రయం హసరంగ, మహీశ్‌‌‌‌ తీక్షణ (2/21), ధనంజయ్‌‌‌‌ డిసిల్వా (1/18) మంచి టర్నింగ్‌‌‌‌తో పాక్‌‌‌‌ను కట్టడి చేశారు. దీంతో నాలుగో ఓవర్‌‌‌‌లోనే  ప్రమోద్‌‌‌‌ మధుషన్‌‌‌‌ (2/21).. రిజ్వాన్‌‌‌‌ను (14) ఔట్‌‌‌‌ చేసి వికెట్ల పతనాన్ని ప్రారంభించాడు. తర్వాత స్పిన్నర్లు జోరందుకోవడంతో పాక్‌‌‌‌ పూర్తి ఓవర్లు ఆడకుండానే చేతులెత్తేసింది. ఓ ఎండ్‌‌‌‌లో బాబర్‌‌‌‌ ఆజమ్ స్థిరంగా ఆడినా..  ఫఖర్‌‌‌‌ జమాన్‌‌‌‌ (13), ఇఫ్తికార్‌‌‌‌ అహ్మద్‌‌‌‌ (13), కుష్దిల్‌‌‌‌ షా (4), తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. దీంతో పవర్‌‌‌‌ ప్లేలో 49/1 స్కోరు చేసిన పాక్‌‌‌‌ ఫస్ట్‌‌‌‌ టెన్‌‌‌‌లో 66/2కు పరిమితమైంది. మధ్యలో మహ్మద్‌‌‌‌ నవాజ్‌‌‌‌ (26) కాసేపు ప్రయత్నించి విఫలం కాగా, ఆసిఫ్‌‌‌‌ అలీ (0), హసన్‌‌‌‌ అలీ (0) డకౌట్‌‌‌‌గా వెనుదిరిగారు. లోయర్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌లో ఉస్మాన్‌‌‌‌ ఖదీర్‌‌‌‌ (3), హారిస్‌‌‌‌ రవూఫ్‌‌‌‌ (1) నిరాశపర్చారు. ఆఖరి 10 ఓవర్లలో పాక్‌‌‌‌ 55 రన్సే చేయడంతో లంక ముందు చిన్న టార్గెట్‌‌‌‌నే ఉంచింది. 

నిశాంక నిలకడ..
టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో శ్రీలంక 17 ఓవర్లలో 124/5 స్కోరు చేసింది. ఓపెనర్‌‌‌‌ నిశాంక చివరి వరకు క్రీజులో నిలిచి టీమ్‌‌‌‌ను గెలిపించాడు. ఆరంభంలో పాక్‌‌‌‌ పేసర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌‌‌‌ చేయడంతో కుశాల్‌‌‌‌ మెండిస్‌‌‌‌ (0), గుణతిలక (0), ధనంజయ్‌‌‌‌ డిసిల్వా (9) సింగిల్‌‌‌‌ డిజిట్‌‌‌‌ స్కోరుకే పరిమితమయ్యారు. ఐదు ఓవర్లలో 29 రన్స్‌‌‌‌కే 3 వికెట్లు కోల్పోవడంతో ఇన్నింగ్స్‌‌‌‌ ఆదుకునే బాధ్యతను నిశాంక, రాజపక్స తీసుకున్నారు. ఈ ఇద్దరు ఆచితూచి ఆడుతూ పవర్‌‌‌‌ప్లేలో 37/3 ఉన్న స్కోరును తొలి 10 ఓవర్లలో 68/3కి చేర్చారు. అయితే క్రీజులో కుదురుకున్న ఈ జంటను.. 12వ ఓవర్‌‌‌‌లో ఖదీర్‌‌‌‌ (1/34) విడదీశాడు. ఓ స్లో బాల్‌‌‌‌తో రాజపక్సను ఔట్‌‌‌‌ చేయడంతో నాలుగో వికెట్‌‌‌‌కు 51 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ బ్రేక్‌‌‌‌ అయ్యింది. ఈ దశలో డాసున్‌‌‌‌ షనక (21) వేగంగా ఆడాడు. చివర్లో హసరంగ (10 నాటౌట్‌‌‌‌) కూడా బ్యాట్‌‌‌‌ ఝుళిపించడంతో మరో 18 బాల్స్‌‌‌‌ మిగిలి ఉండగానే లంక విజయ లాంఛనం పూర్తి చేసింది. మహ్మద్‌‌‌‌ హస్నైన్‌‌‌‌, రవూఫ్‌‌‌‌ చెరో రెండు వికెట్లు తీశారు. హసరంగకు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌  ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది.

సంక్షిప్త స్కోర్లు
పాకిస్తాన్‌‌: 19.1 ఓవర్లలో 121 ఆలౌట్‌‌ (బాబర్‌‌ 30, నవాజ్‌‌ 26, హసరంగ 3/21, మహీశ్‌‌ 2/21), శ్రీలంక: 17 ఓవర్లలో 124/5 (నిశాంక 55 నాటౌట్‌‌, రాజపక్స 24, రవూఫ్‌‌ 2/19).