శ్రీలంక భారీ విజయం

శ్రీలంక భారీ విజయం

గాలె: లెఫ్టార్మ్‌‌ స్పిన్నర్‌‌ ప్రభాత్‌‌ జయసూరియా (7/52, 3/56) స్పిన్‌‌ దెబ్బకు.. మూడు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్ట్‌‌లో శ్రీలంక ఇన్నింగ్స్‌‌ 280 రన్స్‌‌ భారీ తేడాతో ఐర్లాండ్‌‌ను చిత్తు చేసింది. దీంతో రెండు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో లంక 1–0 లీడ్‌‌లో నిలిచింది. 117/7 ఓవర్‌‌నైట్‌‌ స్కోరుతో మంగళవారం మూడో రోజు ఆట కొనసాగించిన ఐర్లాండ్‌‌ ఫస్ట్‌‌ ఇన్నింగ్స్‌‌లో 52.3 ఓవర్లలో 143 రన్స్‌‌కే కుప్పకూలింది.

లోర్కాన్‌‌ టక్కర్‌‌ (45) టాప్‌‌ స్కోరర్‌‌. తర్వాత ఫాలో ఆన్‌‌ మొదలుపెట్టిన ఐర్లాండ్‌‌ రెండో ఇన్నింగ్స్‌‌లోనూ 54.1 ఓవర్లలో 168 రన్స్‌‌కు ఆలౌటైంది. హ్యారీ టెక్టర్‌‌ (42), డాక్రిల్‌‌ (32), కాంపెర్‌‌ (30) మినహా మిగతా వారు ఫెయిలయ్యారు. జయసూరియాకు తోడుగా రమేశ్‌‌ మెండిస్‌‌ 4, విశ్వ ఫెర్నాండో 2 వికెట్లు తీశారు. జయసూరియాకు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది.