కొలంబో విమానంలో పహల్గాం అనుమానితుడు .. ఫ్లైట్​ను చెక్ చేసిన శ్రీలంక పోలీసులు

కొలంబో విమానంలో పహల్గాం అనుమానితుడు .. ఫ్లైట్​ను చెక్ చేసిన శ్రీలంక పోలీసులు

కొలంబో: చెన్నై నుంచి కొలంబో చేరుకున్న శ్రీలంకన్  ఎయిర్ లైన్స్ విమానంలో పహల్గాం దాడి అనుమానితుడు ఉన్నాడన్న సమాచారంతో శ్రీలంక పోలీసులు ఆ ఫ్లైట్​ను పూర్తిగా తనిఖీ చేశారు. శ్రీలంకన్ ఎయిర్ లైన్స్​కు చెందిన ఫ్లైట్  ఒకటి శనివారం చెన్నై నుంచి కొలంబోకు బయల్దేరింది. 

మధ్యాహ్నం 11.59 గంటలకు కొలంబోలోని బండారునాయకె విమానాశ్రయంలో ల్యాండయింది. ఆ విమానంలో పహల్గాం ఉగ్రదాడి  అనుమానితుడు ఉన్నాడని లంక పోలీసులకు సమాచారం అందింది. దీంతో విమానంలో సోదాలు చేశారు. అనుమానితులు లేకపోవడంతో ఫ్లైట్​ను అనుమతించారని శ్రీలంకన్  ఎయిర్ లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.