లంక ప్రీమియర్ లీగ్‌లో గాయపడ్డ చమిక కరుణరత్నే

లంక ప్రీమియర్ లీగ్‌లో గాయపడ్డ చమిక కరుణరత్నే

లంక ప్రీమియర్ లీగ్‌లో  శ్రీలంక క్రికెటర్ చమిక కరుణరత్నే గాయపడ్డాడు. క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించి తన నోటికి దెబ్బ తగిలిచ్చుకున్నాడు. గాలే గ్లాడియేటర్స్ ఇన్నింగ్స్ లో భాగంగా కార్లెస్ బ్రాత్‌వైట్ బౌలింగ్‌లో ఫెర్నాండో భారీ షాట్‌కు ప్రయత్నించాడు. అయితే బంతి గాల్లోకి లేచింది. ఈ క్యాచ్‌ను అందుకునేందుకు పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కరుణరత్నే పరుగెత్తాడు. బంతి గమనాన్ని అంచనా వేయలేకపోయి కరుణరత్నే మూతికి బంతి బలంగా తాకింది. పళ్లు ఊడిపోయాయి. తీవ్రంగా రక్తం కారింది. దెబ్బతగిలినా మాత్రం...కరుణ రత్నే క్యాచ్ వదల్లేదు. బాల్ ను  అందుకున్న తర్వాత నొప్పితో డగౌట్ కు వెళ్లిపోయాడు. ఆ తర్వాత కరుణ రత్నేను ఆసుపత్రిలో చేరాడు. బంతి తగలడం వల్ల కరుణరత్నేకు నాలుగు పళ్లు ఊడిపోయాయని.. సర్జరీ చేయాలని డాక్టర్లు సూచించారు.  ప్రస్తుతం కరుణ రత్నే క్యాచ్‌ వీడియో వైరల్‌గా మారింది.

https://twitter.com/AdaDeranaSports/status/1600534367473844224
ఏడాదిపాటు నిషేధం..

టీ20 వరల్డ్ కప్ 2022 ఆడిన చమీక కరుణరత్నేపై  శ్రీలంక క్రికెట్ అసోసియేషన్ ఏడాది పాటు నిషేధం విధించింది. బోర్డు  నిబంధనలను ఉల్లంఘించినందుకు అతను ఏ  ఫార్మాట్ ఆడకుండా లంక బోర్డు నిషేధించింది. నిషేధంతో పాటు 5 వేల డాలర్ల ఫైన్ విధించింది. అయితే టీ20 ప్రపంచకప్ 2022 కోసం ఆస్ట్రేలియాకు వెళ్లిన కరుణరత్నే.. బ్రిస్బేన్‌లోని ఓ క్యాసినోలో తాగి...స్థానికులతో గొడవపడ్డట్టు ఆరోపణలు వచ్చాయి. అటు ఇంగ్లండ్ పర్యటనలోనూ బయోబబుల్ బ్రేక్ చేసి సిగరేట్లు తాగడం  అప్పట్లో వివాదాస్పదమైంది.