ఘనంగా శ్రీరాధాష్టమి వేడుకలు

ఘనంగా శ్రీరాధాష్టమి వేడుకలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: బంజారాహిల్స్ హరేకృష్ణ గోల్డెన్​ టెంపుల్​లో ఆదివారం శ్రీరాధాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా రాధాగోవిందులను కొత్త వస్త్రాలు, ఆభరణాలతో అలంకరించారు. 

సాయంత్రం వేద మంత్రోచ్ఛరణలు, హరినామ సంకీర్తనల మధ్య పుష్పాభిషేకం, పల్లకీసేవ జరిపారు.  హరేకృష్ణ మూవ్ మెంట్​ హైదరాబాద్ అధ్యక్షుడు సత్య గౌర చంద్ర దాస ప్రభుజీ ప్రవచనాలు వినిపించారు. భక్తులకు నిర్వాహకులకు ప్రసాదం అందించి, అన్నదానం చేపట్టారు.