"తొక్కలో కెప్టెన్సీ" రోహిత్ పై శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్.. మండిపడుతున్న ఫ్యాన్స్

"తొక్కలో కెప్టెన్సీ" రోహిత్ పై శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్.. మండిపడుతున్న ఫ్యాన్స్

ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit sharma)పై సంచలన కామెంట్స్ చేసింది వివాదాస్పద నటి శ్రీరెడ్డి(Sri reddy). ప్రస్తుతం టీమ్ ఇండియా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఆడుతోంది. ఇందులో భాగంగా జరిగిన ఫైనల్ మ్యాచ్ ఇండియా పేలవ ప్రదర్శన కనబరిచింది. దీంతో టీమ్ ఇండియా అభిమానులు కాస్త నిరాశ చెందారు.

ఇదే విషయంతాజాగా స్పందించింది శ్రీరెడ్డి. ఇందులో భాగంగా కెప్టెన్ రోహిత్ శర్మను టార్గెట్ చేస్తూ విమర్శలు కూడా చేసింది. అదే క్రమంలో విరాట్ కోహ్లీ(Virat Kohli) పై ప్రశంసలు కురిపిస్తూ.. రోహిత్ ని తక్కువ చేసి అయితే మాట్లాడింది. "తొక్కలో కెప్టెన్సీ. ఇదేమన్నా ఐపీఎల్ అనుకున్నవా బాబు. నీ కెప్టెన్సీ చూసి కోహ్లి కూడా నవ్వుకుంటున్నాడు. రోజంత ఫీల్డింగ్ చేస్తూ.. బౌలింగ్ చెయ్యాలంటే ప్లేయర్స్ లో జోష్ కావాలి. అది కోహ్లి మాత్రమే చెయ్యగలడు. అతడు ప్లేయర్స్ను ఇన్స్పైర్ చేస్తాడు. అందుకే కోహ్లీ ప్రపంచంలోనే ఉత్తమ టెస్ట్ కెప్టెన్ అని శ్రీరెడ్డి తన కామెంట్స్ చేసింది.

శ్రీరెడ్డి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. రోహిత్ శర్మ అభిమానులు శ్రీరెడ్డి పై మండిపడుతున్నారు. నెగిటివ్ కామెంట్స్ పెడుతూ.. బూతులు కూడా తిడుతున్నారు.ఇప్పటి వరకు సినిమా వారిపై రెచ్చిపోయిన శ్రీ రెడ్డి.. ఈ సారి క్రికెటర్స్ మీద పడిందేంటి? సినిమా వాళ్ళను తిట్టి తిట్టి బోర్ కొట్టిందేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.