ఫైనల్ డెసిషన్‌‌ మాత్రం నాదే

ఫైనల్ డెసిషన్‌‌ మాత్రం నాదే

మత్తు వదలరా, తెల్లవారితే గురువారం చిత్రాలతో ఆకట్టుకున్న శ్రీ సింహా.. ‘దొంగలున్నారు జాగ్రత్త’ అంటూ రేపు వస్తున్నాడు. ఈ సందర్భంగా ఇలా ముచ్చటించాడు. ‘‘కారు ఎత్తుకెళ్లడానికి వచ్చిన దొంగ.. డోర్స్ లాక్‌‌ అవడంతో కారులోనే ఇరుక్కుపోతాడు. అందులో ఓ టైమ్‌‌ బాంబ్ కూడా ఉంటుంది. అతనెలా బయటపడ్డాడనేది స్టోరీ. వెసులుబాటు కోసం కారును ఏ పార్ట్‌‌కి ఆ పార్ట్‌‌ తీసి మళ్లీ అమర్చేలా మాడిఫైడ్ చేశారు. ఒకే జానర్‌‌‌‌కి కట్టుబడకుండా ఏ జానర్‌‌‌‌లో నటించేందుకైనా రెడీగా ఉన్నా.  స్టోరీ గ్రిప్పింగ్‌‌గా, ఎంటర్‌‌‌‌టైనింగ్‌‌గా ఉంటే పది నిముషాల పాత్రయినా చేస్తా. కథల ఎంపిక విషయంలో నాన్న, రాజమౌళి బాబాయితో పాటు కుటుంబ సభ్యులందరి సలహాలూ తీసుకుంటా. ఫైనల్ డెసిషన్‌‌ మాత్రం నాదే. బాబాయి కనుక రాజమౌళి గారితో చనువుండొచ్చు. కానీ నటుడిగా ఏ స్థాయిలో ఉన్నానో నాకు తెలుసు. ఆయన నాతో సినిమా చేసే స్థాయికి ఎదగాలంటే చాలా టైమ్ పడుతుంది. అదొక డ్రీమ్. ఇప్పుడప్పుడే దాన్ని ఆశించకూడదు కూడా. ప్రస్తుతానికి ‘భాగ్‌‌ సాలే’ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. ఈ ఇయరే రిలీజ్. ‘ఉస్తాద్‌‌’ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీటయ్యింది.’’