శ్రీశ్రీశ్రీ రాజా వారు విచ్చేస్తున్నారు.. హీరోగా ఎన్టీఆర్ బావమరిది

శ్రీశ్రీశ్రీ రాజా వారు విచ్చేస్తున్నారు.. హీరోగా ఎన్టీఆర్ బావమరిది

గుర్తుందా శీతాకాలం చిత్రంతో నిర్మాతగా పరిచయమయ్యారు చింతపల్లి రామారావు. ప్రస్తుతం ఆయన నిర్మిస్తున్న చిత్రం ‘శ్రీశ్రీశ్రీ రాజా వారు’.  ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా దర్శకుడు వేగేశ్న సతీష్ కాంబినేషన్‌‌‌‌‌‌‌‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియచేసిన రామారావు మాట్లాడుతూ ‘కమర్షియల్‌‌‌‌‌‌‌‌ చిత్రంగా దీన్ని రూపొందిస్తున్నాం.

 ఇప్పటికే షూటింగ్‌‌‌‌‌‌‌‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేశాం. ఈ నెలాఖరులో ఫస్ట్ కాపీ సిద్ధం కాబోతుంది. త్వరలోనే రిలీజ్ డేట్‌‌‌‌‌‌‌‌ను కూడా అనౌన్స్ చేస్తాం. అలాగే తెలుగులో ఓ స్టార్ హీరోతో భారీ సినిమా ప్లాన్ చేస్తున్నా.  కన్నడ, మరాఠీలోనూ సినిమాలు నిర్మించబోతున్నా. ఏడాదికి మూడు సిని మాలు నిర్మించేలా ప్లాన్ చేసుకుంటున్నా.  కమర్షియల్ వాల్యూస్‌‌‌‌‌‌‌‌తో పాటు,  సమాజానికి మేలు చేసే అంశాలు ఉండేలా సినిమాలు నిర్మిస్తాను’ అని అన్నారు.