Single Censor Review: ‘సింగిల్’ సెన్సార్ రివ్యూ.. శ్రీవిష్ణు మూవీకి టాక్ ఎలా ఉందంటే?

Single Censor Review: ‘సింగిల్’ సెన్సార్ రివ్యూ.. శ్రీవిష్ణు మూవీకి టాక్ ఎలా ఉందంటే?

హీరో శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్ మూవీ ‘సింగిల్’(Single). కేతిక శర్మ, ఇవానా హీరోయిన్స్. వెన్నెల కిషోర్​ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీ రేపు (2025 మే9న) థియేటర్లోకి రానుంది. కార్తీక్ రాజు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ సెన్సార్ టాక్ బయటకి వచ్చింది.

పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ యూ/ఏ (U/A) సర్టిఫికెట్ జారీ చేసింది. సినిమా రన్‌టైమ్‌ను 2 గంటల 5 నిమిషాలు ఉండనుంది. ఈ క్రమంలో సింగిల్ సినిమాకు సెన్సార్ నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి.

సినిమా మొత్తం కామెడీ ట్రయాంగిల్ లవ్ స్టోరీతో అలరిస్తుందని సెన్సార్ బృందం చెబుతుంది.  సినిమా లైట్ హార్టెడ్ టోన్‌లో సాగుతూ, క్లైమాక్స్‌లో డిఫరెంట్ ట్విస్ట్‌తో ముగుస్తుందట. ఇందులో ముఖ్యంగా మెట్రో ట్రైన్ ఎపిసోడ్‌లు, వెన్నెల కిషోర్-హీరో శ్రీవిష్ణు- బుల్లిరాజు మధ్య వచ్చే సీన్స్, VTV గణేష్ పాత్ర సినిమాకు హైలైట్‌గా ఉండనున్నాయట.

శ్రీవిష్ణు మార్క్ కామెడీ టైమింగ్ పంచ్‍లతో ఇరగదీశాడని, కేతిక శర్మ, ఇవానా ఇద్దరు హీరోయిన్లుగా మంచి నటన కనబరచారట. కేతికా కామెడీ టోన్‌కు పర్ఫెక్ట్ యాప్ట్ అయిందట. డైరెక్టర్ కార్తీక్ రాజు ఎక్కడ తన కామెడీ పంథాను బోర్ కొట్టకుండా ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు సెన్సార్ నుంచి బయటకి వచ్చింది.  అంతేకాకుండా థియేటర్లలో చాలా కాలం తర్వాత, ప్రేక్షకులు మంచి ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ చూడబోతారంటూ మేకర్స్ సైతం చెప్పుకొస్తున్నారు.

►ALSO READ | Dil Raju: కోర్ట్ డైరెక్టర్ రామ్ జగదీశ్ రెండో మూవీ.. నిర్మాత దిల్ రాజు బంపరాఫర్!

ఇకపోతే, డిఫరెంట్ స్క్రిప్ట్లు సెలెక్ట్ చేసుకుంటూ తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు శ్రీవిష్ణు. ఇందులో భాగంగా ‘సామజవరగమన’, ‘ఓం భీమ్ బుష్’వంటి చిత్రాలతో సూపర్ హిట్ అందుకున్న శ్రీవిష్ణు ఖాతాలో మరో హిట్ పడేలా కనిపిస్తోంది. ఇప్పటికే, రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్, ట్రైలర్ వీపరీతంగా ఆకట్టుకున్నాయి. 

అలాగే, సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు సెన్సార్ రిపోర్ట్స్ నుంచి వచ్చిన వార్తలను షేర్ చేస్తున్నారు. ఈ సినిమాతో హీరో శ్రీ విష్ణు భారీ హిట్ కొట్టేస్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మూవీని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, కాల్యా ఫిల్మ్స్ బ్యానర్లపై విద్య కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు.

'U/A' సర్టిఫికేట్: ఎవరైనా  దీన్ని చూడవచ్చు.. కాకపోతే 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఈ చిత్రాన్ని వారి తల్లిదండ్రులతో కలిసొ లేదా పెద్దల తోడుతో చూడాలని సూచిస్తారు. ఈ సర్టిఫికేట్ పొందిన సినిమాల్లో హింసాత్మక యాక్షన్ సన్నివేశాలు,  కొంతవరకు నగ్నత్వం ఉంటుంది.