ఇది కంటెంట్కు ఉన్న సత్తా.. స్పైను బీట్ చేసిన సామజవరగమన

ఇది కంటెంట్కు ఉన్న సత్తా.. స్పైను బీట్ చేసిన సామజవరగమన

సినిమా అంటే స్టార్ కాస్ట్ కాదు, భారీ బడ్జెట్ కాదు, నెక్స్ట్ లెవల్ ప్రమోషన్స్ కాదు, పాన్ ఇండియా రేంజ్ కాదు. సినిమా అంటే కంటెంట్. కంటెంట్ లేకుండా.. ఎన్ని కోట్లు పెట్టినా, ఎంత పెద్ద స్టార్ హీరో చేసినా.. అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఇదే విషయాన్ని చాలా సినిమాలు ఇప్పటికే ప్రూవ్ చేశాయి. ఇప్పుడు మరో చిన్న సినిమా మళ్ళీ ప్రూవ్ చేసింది. అదే శ్రీ విష్ణు(Sri Vishnu) హీరోగా చేసిన సామజవరగమన(Saamajavaragamana). 

జూన్ 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి పోటీగా అదేరోజు నిఖిల్ సిద్దార్థ్(Nikhil Siddarth) హీరోగా చేసిన పాన్ ఇండియా మూవీ స్పై(Spy) కూడా థియేటర్స్ లోకి వచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజైన స్పై సినిమాకు ప్రేక్షకుల నుండి మిక్సుడ్ టాక్ వచ్చింది. దీంతో ఈ సినిమాను చూడటానికి ప్రేక్షకులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడంలేదు. దీంతో బ్రేక్ ఈవెన్ అవడం కూడా కష్టంగానే ఉందని సమాచారం. 

ఇక సామజవరగమన సినిమా విషయానికి వస్తే.. ఇది ప్యూర్ ఫామిలీ ఎంటర్టైనర్ మూవీ. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా చాలా చిన్న సినిమాగా రిలీజై సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. ఒక శ్రీ విష్ణు తప్పా మిగతా అందరు కొత్తవాళ్లే ఈ సినిమాలో. అయినా కూడా ఈ సినిమాకు మొదటి షో నుండి పాజిటీవ్ టాక్ వచ్చింది. ఆ మౌత్ టాక్ తోనే.. మొదటిరోజు కంటే రెండో రోజు.. రెండో రోజు కంటే మూడో రోజు కలెక్షన్స్ పెరుగుతూ వస్తున్నాయి. దీంతో సామజవరగమన టీమ్ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఇక ఈ సినిమా ఇప్పటివరకు రూ.4 కోట్ల షేర్, రూ.8 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. సినిమాకు మేకర్స్ పెట్టిన దానితో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. దీంతో డిస్ట్రిబ్యూటర్స్ కూడా భారీ లాభాలు చూస్తున్నారు. మరి ఈ సినిమా లాగ్ రాం లో ఏ రేంజ్ లో కలెక్ట్ చేస్తుందో తెలియాలంటే.. మరికొన్ని రోజులు ఆగాల్సిందే.