భద్రాచలంలో ముగిసిన శ్రీయోగానంద లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు

భద్రాచలంలో ముగిసిన శ్రీయోగానంద లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు
  • గోదావరిలో వైభవంగా చక్రతీర్థం

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం సీతారామచంద్రస్వామి అనుబంధ ఆలయమైన శ్రీయోగానంద లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు గురువారంతో ముగిశాయి. ముందుగా స్వామికి ప్రత్యేక పూజలనంతరం సుదర్శన చక్రాన్ని తీసుకుని అర్చకులు గోదావరి తీరానికి వెళ్లారు. అక్కడ సుదర్శన చక్రానికి అభిషేకం, తిరుమంజనం తర్వాత అర్చకులు శిరస్సుపై ధరించి చక్రస్నానం నిర్వహించారు. 

ఈ చక్రతీర్థం తర్వాత శ్రీయోగానంద లక్ష్మీనర్సింహస్వామికి ద్వాదశ పూజలు, హారతులు, ప్రదక్షిణలు ఇచ్చారు. ధ్వజా అవరోహణంను వేదోక్తంగా నిర్వహించి గరుడముద్దలను నివేదించారు. పుష్పయాగం జరిగింది. దీనితో బ్రహ్మోత్సవాలు ముగిసినట్లుగా అర్చకులు ప్రకటించారు. ఈనెల 10వ తేదీన బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.