యశస్వి స్కీంలో తెలంగాణకు అధిక ప్రాధాన్యం ఇవ్వండి

యశస్వి స్కీంలో తెలంగాణకు అధిక ప్రాధాన్యం ఇవ్వండి

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్రం ప్రారంభించిన ‘పీఎం యశస్వి’ స్కీం కింద తెలంగాణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల దినోత్సవం సందర్భంగా గురువారం ఆయన.. ఢిల్లీలో కేంద్ర ఎంఎస్ఎంఈల శాఖ మంత్రి జితన్ రామ్ మాంఝీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ భేటీలో శ్రీధర్ బాబుతో పాటు ధర్మపురి ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ లక్ష్మణ్​ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల బలోపేతానికి  కేంద్రం సహకరించాలని అభ్యర్థించారు. దేశవ్యాప్తంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో లక్ష మంది మహిళలను ఎంపిక చేసి శిక్షణతో పాటు, ఉత్పాదన సామర్థ్యాన్ని పెంచేందుకు తోడ్పాటును అందించాలని కోరారు.