
వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల, శియా గౌతమ్ ప్రధాన పాత్రల్లో రైటర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. వెన్నపూస రమణ రెడ్డి నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ మూవీ ఫస్ట్ సాంగ్‌ను డైరెక్టర్ హరీష్ శంకర్ రిలీజ్ చేసి టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు. సునీల్ కశ్యప్ కంపోజ్ చేసిన పాటకు రామజోగయ్యశాస్త్రి లిరిక్స్ రాయగా, మంగ్లీ పాడింది.
‘మా ఊరు శ్రీకాకుళం.. మేమంతా శ్రామికులం.. స్వేధమే మూలధనం.. ఊరికి మాకు దూరం’ అంటూ సాగిన పాటలో ఉపాధి కోసం సొంత ఊరు, సొంత వాళ్లను విడిచి ఇతర రాష్ట్రాల్లో ఉండే వారి ఆవేదనను చూపించడం సినిమాపై ఆసక్తిని పెంచింది. ఇందులో వెన్నెల కిషోర్, భద్రం, నాగ మహేష్ రెట్రో లుక్స్‌లో ఆకట్టుకున్నారు. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందించిన ఈ సినిమా ఫన్నీగా థ్రిల్లింగ్‌గా ఉంటుందని మేకర్స్ చెప్పారు.