WTC ఫైనల్ మ్యాచ్ రిఫరీగా శ్రీనాథ్‌..‌‌‌‌‌‌‌ నితిన్‌‌‌‌‌‌‌‌కు ఫోర్త్ అంపైర్ బాధ్యతలు

WTC ఫైనల్ మ్యాచ్ రిఫరీగా శ్రీనాథ్‌..‌‌‌‌‌‌‌ నితిన్‌‌‌‌‌‌‌‌కు ఫోర్త్ అంపైర్ బాధ్యతలు

దుబాయ్‌‌‌‌‌‌‌‌: టీమిండియా మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్ ఫైనల్‌‌‌‌‌‌‌‌కు మ్యాచ్ రిఫరీగా వ్యవహరించనున్నాడు. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య లార్డ్స్ స్టేడియంలో జూన్ 11న మొదలయ్యే డబ్ల్యూటీసీ టైటిల్ ఫైట్ మ్యాచ్ అఫీషియల్స్ లిస్ట్‌‌‌‌‌‌‌‌ను ఐసీసీ శుక్రవారం ప్రకటించింది. శ్రీనాథ్ రిఫరీగా ఎంపికవ్వగా.. ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్‌‌‌‌‌‌‌‌వర్త్‌‌‌‌‌‌‌‌, న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌కు చెందిన క్రిస్‌‌‌‌‌‌‌‌ గఫానీ ఆన్‌‌‌‌‌‌‌‌ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరిస్తారు. ఇల్లింగ్‌‌‌‌‌‌‌‌వర్త్‌‌‌‌‌‌‌‌ వరుసగా మూడు డబ్ల్యూటీసీ ఫైనల్స్‌‌‌‌‌‌‌‌కు ఆన్‌‌‌‌‌‌‌‌ ఫీల్డ్ అంపైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పని చేసిన అరుదైన ఘనత అందుకోనున్నాడు. 

ఇండియాకే చెందిన నితిన్ మీనన్ ఫోర్త్ అంపైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పని చేయనున్నాడు. 2021 మెన్స్ టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లోనూ నితిన్ టీవీ అంపైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వ్యవహరించాడు. గతంలో పలు ఐసీసీ ఫైనల్స్‌‌‌‌‌‌‌‌కు పని చేసిన ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌కు చెందిన రిచర్డ్ కాటిల్‌‌‌‌‌‌‌‌బరో టీవీ అంపైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అపాయింట్ అయ్యాడు. కాగా,అనుభవం, పనితీరు ఆధారంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌‌‌‌‌‌‌‌కు అఫీషియల్స్‌‌‌‌‌‌‌‌ను ఎంపిక చేసినట్టు ఐసీసీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ జై షా పేర్కొన్నారు.