మరోసారి భారీ మెజార్టీతో  గెలుస్తా : శ్రీనివాస్ గౌడ్

మరోసారి భారీ మెజార్టీతో  గెలుస్తా : శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: ఈ ఎన్నికల్లో హంగ్ కు అవకాశం లేదని, హ్యాట్రిక్  సీఎం కేసీఆరేనని మంత్రి శ్రీనివాస్ గౌడ్  పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీస్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్  నాయకులు తప్పుడు సర్వేలతో ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని, సురభి నాటకాలకు మించి నటిస్తున్నారని విమర్శించారు. 2018లోనూ తమకు 48 సీట్లు మాత్రమే వస్తాయని ఎగ్జిట్ పోల్ లో అంచనా వేశారని, అప్పుడు88 స్థానాలు వచ్చాయని గుర్తు చేశారు. ఈ నెల 3న వచ్చే ఫలితాల్లోనూ ఇదే రిపీట్ అవుతుందని, తమకు 71 నుంచి 81 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

తాము చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమకు మరోసారి పట్టం కడతాయన్నారు. బీజేపీ మత రాజకీయాలు, కాంగ్రెస్  కుల రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. దొంగ హామీలు, దొంగ సర్వేలతో ప్రజలను అయోమయానికి గురి చేస్తున్న కాంగ్రెస్  పార్టీకి ఫలితాలు వచ్చాక తల బొప్పి కడుతుందన్నారు. మాజీ మంత్రి పి చంద్రశేఖర్, లైబ్రరీ చైర్మన్  రాజేశ్వర్ గౌడ్, ముడా చైర్మన్  గంజి వెంకన్న, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు గోపాల్ యాదవ్, గొర్రె కాపరుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శాంతయ్య యాదవ్, బీఆర్ఎస్కేవీ అధ్యక్షుడు కృష్ణమోహన్, మార్కెట్  కమిటీ చైర్మన్  రెహమాన్, మాజీ మార్కెట్  కమిటీ చైర్మన్  చెరుకుపల్లి రాజేశ్వర్  పాల్గొన్నారు.