సింగరేణి మార్కెటింగ్ జీఎంగా శ్రీనివాస్

సింగరేణి మార్కెటింగ్ జీఎంగా శ్రీనివాస్

గోదావరిఖని, వెలుగు :  సింగరేణి సంస్థ మార్కెటింగ్​విభాగం జనరల్​ మేనేజర్​గా గోదావరిఖని జవహర్​నగర్​కు చెందిన తాడబోయిన శ్రీనివాస్​బాధ్యతలు చేపట్టారు. మంగళవారం హైదరాబాద్​లోని హెడ్డాఫీసులో బాధ్యతలు తీసుకోగా.. పలువురు ఆఫీసర్లు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. సింగరేణిలో సాధారణ ఓవర్​మెన్​గా జాబ్ లో చేరి వివిధ హోదాల్లో పదోన్నతులు పొందుతూ జీఎం స్థాయికి చేరారు. 

మొన్నటి వరకు శ్రీరాంపూర్​ఓసీపీ ప్రాజెక్ట్​ ఆఫీసర్​గా వ్యవహరించారు. కార్యక్రమంలో  సింగరేణి బహుజన ఎంప్లాయీస్​అసోసియేషన్​ కన్వీనర్​ బోడ భద్రు, ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్​అసోసియేషన్​ ప్రెసిడెంట్ ఇ.రాజేశ్వర్​, బీసీ ఎంప్లాయీస్​అసోసియేషన్​ ప్రెసిడెంట్​సీహెచ్​ప్రభాకర్, సెక్రటరీ బి.రెష్మా, ట్రెజరర్​చరణ్​ రాజ్​, డిప్యూటీ సీఎంఓ బాలకోటయ్య, ఐటీ విభాగం డీజీఎం హరిప్రసాద్​, మేనేజర్​రామ లక్ష్మయ్య,​ లా డిపార్ట్​మెంట్​మేనేజర్​మాధవి తదితరులు ఉన్నారు.