
సయ్యద్ సోహైల్, రూపా కొడవాయుర్ జంటగా శ్రీనివాస్ వింజనంపాటి తెరకెక్కించిన చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల నిర్మించారు. శుక్రవారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా సోహైల్ మాట్లాడుతూ ‘ఇదొక కొత్త జానర్ మూవీ. ప్రెగ్నెంట్‌గా నటించడం రిస్క్ అనుకోలేదు. నాలాంటి యంగ్ యాక్టర్స్.. రొటీన్ కమర్షియల్ ప్రాజెక్ట్స్ చేయడమే రిస్క్ అవుతుంది. మేల్ ప్రెగ్నెంట్ క్యారెక్టర్‌లో నటించడం డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్. నేను ఈ సినిమా ఒప్పుకునేటప్పటికి మా ఇంట్లో ఇద్దరు సిస్టర్స్ ప్రెగ్నెంట్‌గా ఉన్నారు. వాళ్ల బాడీ లాంగ్వేజ్ గమనించాను. ఈ క్యారెక్టర్ కోసం మూడు కిలోల బరువున్న ప్రోస్తటిక్స్ వాడాం. షూటింగ్ టైమ్‌లో ఆ బరువు మోయడమే ఇబ్బందిగా అనిపించేది. అలాంటిది తొమ్మిది నెలలు బిడ్డను మోసేందుకు ఒక తల్లి ఎంత కష్టపడుతుందో ఊహించుకోవచ్చు. ఇప్పటికే కొందరు మహిళలకు సినిమా చూపించగా, అమ్మ పడే ఇబ్బందులు బాగా చూపించారని కన్నీళ్లు పెట్టుకున్నారు. మా సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యిందనడానికి వాళ్ల రెస్పాన్స్ బెస్ట్ ఎగ్జాంపుల్. నా నెక్స్ట్ మూవీ ‘బూట్ కట్ బాలరాజు’ షూటింగ్ పూర్తయింది’ అని చెప్పాడు.