
బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు కొత్త ఇన్‌స్పెక్టర్‌గా శ్రీనివాసరావు సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన ఇన్‌స్పెక్టర్ ఎన్.దేవయ్య తాండూర్ సీఐగా బదిలీ అయ్యారు. కుమ్రం భీం జిల్లా రూరల్ సర్కిల్‌కు చెందిన శ్రీనివాసరావు బదిలీపై ఇక్కడకు వచ్చారు.
ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రజల సహకారం అవసరమన్నారు. గుడుంబా, గంజాయి, ఇతర నిషేధిత పదార్థాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.