భద్రాద్రిలో శ్రీరామ పట్టాభిషేకం..పోటెత్తిన భక్తులు

భద్రాద్రిలో  శ్రీరామ పట్టాభిషేకం..పోటెత్తిన భక్తులు

భద్రాద్రిలోశ్రీరామ చంద్ర స్వామికి పట్టాభిషేకం కొనసాగుతోంది. రాములోరి పట్టాభిషేకానికి  దేశంలోని 12 నదుల నుంచి జలాలను తీసుకొచ్చి అభిషేకం జరుపుతున్నారు రుత్వికులు. గవర్నర్ తమిళి సై దంపతులు హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.  రాములోరి పట్టాభిషేకం తర్వాత గవర్నర్ పర్నశాలను సందర్శిస్తారు.మార్చి 31న కొత్తగూడెం నుంచి బయల్దేరి  ఏప్రిల్ 1 ఉదయం హైదరాబాద్ చేరుకుంటారు గవర్నర్. సీతారాముల పట్టాభిషేక మహోత్సవానికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామి వారి పట్టాభిషేకానికి భక్తులు తరలిరావడంతో భక్తజన సంద్రోహంగా మారింది.  పోలీసు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

ప్రతి ఏడాది సీతారాముల కల్యాణం మరుసటి రోజు పట్టాభిషేకం జరుగుతోంది. ఈ పట్టాభిషేకాన్ని పూర్వం 60 ఏళ్లకోసారి జరిపేవారు. కాలక్రమేనా భక్తుల సౌకర్యార్థం పట్టాభిషేకంలో మార్పులు చేసి 12 ఏళ్లకోసారి నిర్వహిస్తున్నారు.