సిద్దిపేటలో ఘనంగా శ్రీరామ రథ యాత్ర

సిద్దిపేటలో ఘనంగా శ్రీరామ రథ యాత్ర

సిద్దిపేట, వెలుగు: అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతున్న సందర్భంగా ఆదివారం సిద్దిపేటలో ధర్మ కార్య ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శ్రీరామ రథ యాత్ర జరిగింది. స్థానిక మోహిన్ పురలోని కొత్త వేంకటేశ్వర స్వామి ఆలయం నుంచి సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన రథయాత్ర రాత్రి 10 గంటల వరకు కొనసాగింది. కొత్త వేంకటేశ్వ రాలయం నుంచి విక్టరీ టాకీస్ చౌరస్తా, మెదక్ రోడ్డు, పాత బస్టాండ్, సుభాష్ రోడ్డు, లాల్ కమాన్ మీదుగా వైశ్య భవన్ వరకు రథయాత్ర సాగింది.

ఈ కార్యక్రమంలో దాదాపు ఐదు వేల మంది పాల్గొన్నారు. పలు కూడళ్ల లో మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. మహిళల కోలాటాలు, పిల్లల నృత్య ప్రదర్శనలు, దేవతా వేషధారణలు ఆకట్టు కున్నాయి.  ఈ రథయాత్రలో ధార్మిక సంస్థలు, కుల సంఘాలతో పాటు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. వైశ్య భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఉమాపతి రామేశ్వర శర్మ ధార్మిక ప్రసంగాన్ని నిర్వహించారు. రథ యాత్ర సందర్భంగా పట్టణంలోని పలు కూడళ్లను కాషాయ జెండాలతో అలంకరించారు.