
‘శ్రీరంగనీతులు’ టైటిల్ వినగానే ఏఎన్నార్, శ్రీదేవి నటించిన సినిమా గుర్తొస్తుంది. సరిగ్గా ఇదే టైటిల్‌తో సుహాస్ హీరోగా ఓ సినిమా వస్తోంది. రుహాని శర్మ హీరోయిన్. కార్తిక్ రత్నం మరో హీరోగా నటిస్తున్నాడు. వీఎస్‌ఎస్ ప్రవీణ్ కుమార్ దర్శకుడు. బల్మూరి వెంకటేశ్వరరావు నిర్మాత. రీసెంట్‌గా మూవీ టైటిల్‌ను రివీల్ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఇంప్రెస్ చేస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ‘ఇదొక న్యూ ఏజ్ కామెడీ డ్రామా.
త్వరలోనే ఫస్ట్‌లుక్ రిలీజ్ చేయడంతో పాటు ఇతర వివరాలను తెలియజేస్తాం’ అని దర్శకనిర్మాతలు తెలిపారు. విరాజ్ అశ్విన్, తనికెళ్ల భరణి, గీతా భాస్కర్, శ్రీనివాస్ అవసరాల, దేవీ ప్రసాద్, సీవిఎల్ నరసింహారావు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ హర్షవర్థన్ రామేశ్వర్, ‘సేవ్ ది టైగర్స్’ ఫేమ్ అజయ్ అర్సాడ సంగీతం అందిస్తున్నారు.