లడ్డూ స్టాక్‌లో అవకతవకలు..  శ్రీశైలం గుడి అధికారి సస్పెన్షన్

లడ్డూ స్టాక్‌లో అవకతవకలు..  శ్రీశైలం గుడి అధికారి సస్పెన్షన్

శ్రీశైలం దేవస్థానం పడితరం స్టోరులో విధులు నిర్వహిస్తున్న సూపరింటెండెంట్ పి.ఉమేష్ ను సస్పండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు దేవస్థానం ఈవో లవన్న. లడ్డూ తయారీకి సంబంధించిన స్టాక్‌ నిర్వహణలో అవకతవకల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

దేవస్థానం నిర్వహించే లడ్డూ ప్రసాదం పడితరం స్టోరులో ఈవో తనిఖీలు నిర్వహించారు. స్టాక్ రిజిస్టర్ ప్రకారం ఉండాల్సిన బియ్యం, శనగపప్పులో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. స్టోరులో ఉన్న స్టాక్‌ బుక్‌కు, సరుకులకు వ్యత్యాసాలు ఉన్నాయని తనిఖీల్లో తేలింది. రిజిస్టర్, స్టాక్ నిర్వహణలో సూపరింటెండెంట్ ఉమేష్ అలసత్వం వహించినట్లు గుర్తించి సస్పెండ్ చేసినట్లు తెలిపారు దేవస్థానం అధికారులు.