ఈ నెల 13 నుంచి శ్రీవారి తెప్పోత్సవాలు

ఈ నెల 13 నుంచి శ్రీవారి తెప్పోత్సవాలు

తిరుపతి: తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు మార్చి 13 నుంచి ప్రారంభమై ఐదు రోజులపాటు జరుగనున్నట్లు టీటీడీ తెలిపింది. ప్రతిరోజూ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారు. తొలిరోజు సాయంత్రం శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ రామచంద్రమూర్తి తెప్పలపై విహరిస్తారు. రెండో రోజు రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారు మాడ వీధుల ప్రదక్షిణంగా ఊరేగుతూ వచ్చి పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు విహరిస్తారు. ఇక చివరి మూడురోజులు శ్రీదేవి, భూదేవి స మేత మలయప్పస్వామివారు తెప్పపై  విహరించనున్నారు. మూడో రోజు మూడు చుట్లు, నాలుగో రోజు ఐదు చుట్లు, ఐదో రోజు ఏడు చుట్లు విహరించి భక్తులను కటాక్షిస్తారని ఆలయ అర్చకులు తెలిపారు. 

తిరుమలలో తెప్పోత్సవాలు అత్యంత ప్రాచీనకాలం నుంచి జరుగుతున్నాయి. శ్రీ సాళువ నరసింహరాయలు క్రీ.శ 1468లో పుష్కరిణి మధ్యలో ''నీరాళి మండపాన్ని'' నిర్మించి తెప్పోత్సవాలకు అనువుగా తీర్చిదిద్దారు.  క్రీ.శ.15వ శతాబ్దానికి చెందిన శ్రీ తాళ్లపాక అన్నమయ్య తిరుమల తెప్పోత్సవాలను గొప్పగా కీర్తించారు. తెప్పోత్సవాల కారణంగా మార్చి 13,14న జరగాల్సిన వ ర్చువ ల్ అర్జిత  సేవ లైన సహస్ర దీపాలంకార సేవను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. మార్చి 17తో  సాలకట్ల తెప్పోత్సవాలు ముగియనున్నట్లు టీటీడీ తెలిపింది. 

మరిన్ని వార్తల కోసం

రేవంత్​కు పీసీసీ ఇవ్వాల్సిన అవసరమేంది?

టిమ్స్​ హాస్పిటల్ క్లోజ్!