సాగునీటి కోసం తండ్లాట

సాగునీటి కోసం తండ్లాట
  •  ఇయ్యాల్టి వరకే ఎస్సారెస్పీ నీరు
  •  నెలాఖరు వరకు నీరివ్వాలంటున్న రైతులు

జగిత్యాల,వెలుగు: జగిత్యాల జిల్లాలో పంటల సాగు కోసం రైతులు ఎస్సారెస్పీ కాల్వలపైనే ఆధారపడుతారు. యాసంగిలో జిల్లాలో సుమారు 3.43 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగుచేశారు. ఇందులో 2.98 లక్షల ఎకరాల్లో వరిసాగువుతోంది. ప్రస్తుతం ఎండలు మండుతున్నాయి. భూగర్భజలాలు ఇంకిపోతున్నాయి. ఆయకట్టుకు నీరందడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఎస్సారెస్పీ ఆఫీసర్లేమో శుక్రవారం నుంచి కాల్వలకు నీటి విడుదలను ఆపేస్తున్నట్లు ప్రకటించారు. పంట చేతికొచ్చే సమయంలో నీటి విడుదలను ఆపేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ నెలాఖరువరకు నీరివ్వాలని కోరుతున్నారు. మరో రెండు తడులకు నీరు అందితే పంట కోతకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరో రెండు తడుల నీరివ్వాలని కోరుతున్నారు. ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు స్పందించి చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.