ఆర్ఆర్ఆర్ మూవీ రెండుసార్లు చూసిన అవతార్ డైరెక్టర్

ఆర్ఆర్ఆర్ మూవీ రెండుసార్లు చూసిన అవతార్ డైరెక్టర్

టాలీవుడ్ జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ పేరు అంతర్జాతీయ వేదికలపై మార్మోగుతోంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకుని చరిత్ర సృష్టించిన ఈ సినిమా.. రీసెంట్ గా లాస్ ఏంజిల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డును సొంతం చేసుకుంది. ఇలా రికార్డులు సృష్టిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీపై హాలీవుడ్ దిగ్గజం, అవతార్ మూవీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ ప్రశంసల జల్లు కురిపించారు. 

అమెరికాలో జరిగిన ఓ అవార్డ్ ఫంక్షన్లో రాజమౌళి, జేమ్స్ కామెరూన్ కలిశారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ మూవీ రెండుసార్లు చూశానని ఆయన తనతో చెప్పారని రాజమౌళి మురిసిపోతూ ట్వీట్ చేశారు. "ది గ్రేట్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ ఆర్ఆర్ఆర్ మూవీ చూశారు. ఆయనకు సినిమా బాగా నచ్చింది. ఆ సినిమాను చూడమని తన భార్య సుజిక్ జేమ్స్ కు చెప్పిన ఆయన ఆమెతో కలిసి మరోసారి ఆర్ఆర్ఆర్ మూవీ చూశారట. ఆర్ఆర్ఆర్ మూవీ గురించి కామెరూన్ 10 నిమిషాల పాటు నాతో విశ్లేషించడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ప్రపంచంలోనే టాప్ డైరెక్టర్ అయిన ఆయన నన్ను ప్రశంసించడం ఆనందంగా ఉంది. ఇద్దరికీ థాంక్యూ " అని రాజమౌళి ట్వీట్లో రాసుకొచ్చారు.