నిరుద్యోగుల‌కు అల‌ర్ట్: SSC ఎగ్జామ్స్ కొత్త‌ షెడ్యూల్ విడుద‌ల‌

నిరుద్యోగుల‌కు అల‌ర్ట్: SSC ఎగ్జామ్స్ కొత్త‌ షెడ్యూల్ విడుద‌ల‌

క‌రోనా లాక్ డౌన్ కార‌ణంగా వాయిదా ప‌డిన స్టాఫ్ సెలెక్ష‌న్ క‌మిష‌న్ (SSC) ఎగ్జామ్స్ కొత్త షెడ్యూల్ ను క‌మిష‌న్ విడుద‌ల చేసింది. కంబైన్డ్ హైయ్య‌ర్ సెకండ‌రీ లెవల్, కంబైన్డ్ గ్రాడ్యుయేష‌న్ లెవ‌ల్ ఎగ్జామ్స్ ను ఆగ‌స్టు నెల నుంచి నిర్వ‌హించేందుకు నిర్ణ‌యం తీసుకుంది. దీని సంబంధించిన షెడ్యూల్ ను నిన్న ప్ర‌క‌టించింది. మార్చి 20 – 28 మ‌ధ్య‌ జరగాల్సిన కంబైన్డ్ హైయ్యర్ సెకండరీ లెవల్ (CHSL) టైర్-1 పరీక్షల‌ను గ‌తంలో వాయిదా వేసిన SSC ప్రస్తుతం ఆగ‌స్టు 17 నుంచి 27 తేదీల మ‌ధ్య నిర్వ‌హిస్తామ‌ని తెలిపింది. అలాగే మార్చి 30 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగాల్సిన జూనియర్ ఇంజనీర్ (JE) ఎగ్జామ్ ను సెప్టెంబ‌ర్ 1 నుంచి 4 వ‌ర‌కు పెట్ట‌నుంది.

SSC ఎగ్జామ్స్ పూర్తి షెడ్యూల్

 

వాయిదా ప‌డిన ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై స‌మీక్ష చేసేందుకు గ‌తంలో మే 21న క‌మిష‌న్ స‌మావేశ‌మైంది. అయితే ఆ స‌మ‌యంలో క‌రోనా లాక్ డౌన్ కొన‌సాగుతుండ‌డంతో ఎటువంటి నిర్ణ‌యం తీసుకోలేదు. జూన్ 1న మ‌ళ్లీ సమావేశం కావాల‌ని నిర్ణ‌యించింది. ప్ర‌స్తుతం లాక్ డౌన్ ఆంక్ష‌ల‌ను భారీగా స‌డ‌లించ‌డంతో అభ్య‌ర్థుల ప్రిప‌రేష‌న్ కు కొంత స‌మ‌యం ఇచ్చి ప‌రీక్ష‌లు పెట్టాల‌ని క‌మిష‌న్ స‌భ్యులు అభిప్రాయ‌ప‌డ్డారు. దీంతో ఆగ‌స్టు త‌ర్వాత ఎగ్జామ్స్ పెట్టాల‌ని నోటిఫికేష‌న్ జారీ చేసింది క‌మిఫ‌న్. క‌రోనా ప‌రిస్థితులను బ‌ట్టి ఎప్ప‌టిక‌ప్పుడు మార్పుల‌ను తెలుసుకునేందుకు ssc.nic.in  వెబ్ సైట్ ను ఫాలో కావాల‌ని సూచించింది.