GlobeTrotter నుంచి Priyanka Chopra లుక్ వచ్చేసింది.. SSMB29లో ఆమె పాత్రకు Mandakini అనే పేరు ఇందుకే..!

GlobeTrotter నుంచి Priyanka Chopra లుక్ వచ్చేసింది.. SSMB29లో ఆమె పాత్రకు Mandakini అనే పేరు ఇందుకే..!

టాలీవుడ్లోనే.. కాదు కాదు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ప్రెజెంట్ ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉందంటే అది SSMB29 సినిమానే. ఈ సినిమా నుంచి తాజాగా ప్రియాంకా చోప్రా లుక్ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా పాత్ర పేరు మందాకిని. ఒక గుహ దగ్గర శారీలో ఉన్న ప్రియాంకా చోప్రా గన్ పట్టుకుని కాల్చుతూ చాలా స్టైలిష్ లుక్లో ట్రెడిషనల్ కాస్ట్యూమ్ లో కనిపించింది. ఆమె పక్క నుంచి బుల్లెట్స్ దూసుకుపోతున్నాయి. ఆమె ముఖానికి, చేతులకు గాయాలైనట్లు చూపించారు. ఒక బిగ్గెస్ట్ యాక్షన్ సీన్కు సంబంధించిన విజువల్ అని క్లారిటీగా అర్థమవుతోంది. దేశీ లుక్లో గన్తో ప్రత్యర్థులను టార్గెట్ చేస్తున్న ప్రియాంక లుక్ను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పృథ్వీ రాజ్ సుకుమారన్ లుక్పై వచ్చిన విమర్శలు ప్రియాంక లుక్పై దాదాపు రాకపోవచ్చు.

ఇక.. ప్రియాంక పాత్రకు ‘మందాకిని’ అనే పేరు ఫిక్స్ చేయడంతో SSMB29 సినిమాలో మైథలాజికల్ టచ్ ఉంటుందని తేలిపోయింది. పురాణాల్లో ‘మందాకిని’ అంటే గంగ అని అర్థం. పరమ శివుడు గంగకు ఆయన శిరస్సుపై స్థానమిచ్చాడు. అంతటి ప్రాశస్త్యం ఉన్న గంగను ప్రతిబింబించేలా ప్రియాంక చోప్రా పాత్రకు ‘మందాకిని’ అని పేరు పెట్టడంతో ఎస్ఎస్ రాజమౌళి ఈ రిఫరెన్స్ తీసుకుని ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడని నెటిజన్లు డిస్కస్ చేసుకుంటున్నారు. ‘మందాకిని’ అనే నది కూడా మన దేశంలో ఉంది.

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రవహించే అలకనంద నదికి ‘మందాకిని’ ఉపనది. కేదార్నాథ్ ఆలయం మీదుగా ప్రవహించే ‘మందాకిని’ నదిని హిందువులు పవిత్ర నదిగా భావిస్తారు. SSMB29 సినిమాలో విలన్ పాత్ర పేరు ‘కుంభ’. ఈ పేరుకు కూడా హిందూ మైథాలజీలో ఒక బ్యాక్ డ్రాప్ స్టోరీ ఉంది. హిందూ పురాణాల ప్రకారం.. మొదటి కుంభాన్ని శివుడి వివాహం సందర్భంగా ప్రజాపతి సృష్టించాడు. సో.. ఇవన్నీ చూస్తుంటే.. ఆ ముక్కంటికి SSMB29 కథలో చాలానే ఇంపార్టెన్స్ ఉందని అర్థమవుతోంది. కేవలం.. యాక్షన్ అడ్వెంచర్ డ్రామా జానర్ సినిమా మాత్రమే కాదని.. మైథలాజికల్ రిఫరెన్స్ కూడా తీసుకుని ఈ కథ రాసుకున్నారని ఈ పాత్రల పేర్లతో స్పష్టమవుతోంది. మహేష్ బాబు పాత్ర పేరు కూడా శివుడిని ప్రతిబింబించేలా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. ‘రుద్ర’ అని ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోంది.

దర్శకుడు రాజమౌళి, హీరో మహేష్ బాబు, హీరోయిన్ ప్రియాంక చోప్రా, విలన్ పృథ్వీ రాజ్ సుకుమారన్.. ఒక సినిమా ఇండియా మొత్తం ట్రెండింగ్ టాపిక్ అవడానికి ఇంతకు మించి ఇంకేం కావాలి చెప్పండి. GlobeTrotter వర్కింగ్ టైటిల్గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. ఈ సినిమా నుంచి పృథ్వీ రాజ్ సుకుమారన్ లుక్ ఇప్పటికే వచ్చేసింది. ఈ లుక్  కొందరికి నచ్చింది. కొందరు ఈ లుక్పై పెదవి విరిచారు.

ప్రియాంక లుక్పై ప్రస్తుతం పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. ఇక.. మహేష్ బాబు లుక్ ఒక్కటే మిగిలి ఉంది. నవంబర్ 15న GlobeTrotter ఈవెంట్ను గ్రాండ్గా ప్లాన్ చేశారు. ఆరోజే ఈ సినిమా టైటిల్ను, ఈ సినిమా థీమ్ గ్లింప్స్ను విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే శ్రుతి హాసన్ పాడిన థీమ్ సాంగ్ అదిరిపోయింది. లిరిక్స్కు మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.