పేరు మారింది.. ఇకనుండి SSMB 29 కాదు!

పేరు మారింది.. ఇకనుండి SSMB 29 కాదు!

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli), సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) కాంబోలో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసందే. ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఆర్ఆర్ఆర్ లాటి గ్లోబల్ హిట్ తరువాత రాజమౌళి నుండి వస్తున్న సినిమా కావడం.. అది కూడా మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో అవడంతో ఇంటర్నేషనల్ వైడ్ గా ఈ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ అవుతోంది. దీంతో ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. 

తాజాగా ఈ కంబోకి సంబందించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. నిన్నమొన్నటి వరకు రాజమౌళి,మహేష్ బాబు సినిమాకు వర్కింగ్ టైటిల్ గా SSMB 29 ఉండేది. కానీ, ఇకనుండి అదికాస్తా SSRMB గా మారనుందట. కారణం ఈ సినిమాలో సూపర్ మహేష్ బాబూ అయినప్పటికి.. ఎక్కువ బిజినెస్ జరిగేది SS రాజమౌళి వల్లనే. అందుకే ఈ సినిమా వర్కింగ్ టైటిల్ లో SSR(SS రాజమౌళి) పేరు ఉండేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అందుకే ఈ ప్రాజెక్టును ఇకనుండి SSRMB గా పిలువనున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ALSO READ :-తొలిప్రేమ స్టైల్లో వరుణ్ లవ్ ప్రపోజల్.. భర్తపై లావణ్య క్యూట్ కామెంట్స్

ఇక SSRMB సినిమా విషయానికి వస్తే.. యాక్షన్ అండ్ అడ్వెంచర్ బ్యాక్డ్రాప్ లో రానుందంట. మహేష్ బాబు ఈ సినిమాలో హిప్పీ(వలస జీవులు) గా కనిపించనున్నాడట. ఇక ఈ ప్రాజెక్టుకు సంబందించిన కథ కూడా ఇప్పటికే రెడీ అయిందని, త్వరలోనే లాంఛనంగా ఈ సినిమా మొదలుకానుంది సమాచారం. మరి భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.