యూఎస్​లో మళ్లీ పేలిన గన్

యూఎస్​లో మళ్లీ పేలిన గన్
  • బర్మింగ్​హామ్ ​చర్చిలో ఫైరింగ్​
  • ఇద్దరు మృతి.. ఒకరికి గాయాలు

వెస్టావియా హిల్స్​(యూఎస్): అమెరికాలో మళ్లీ గన్ పేలింది. బర్మింగ్​హామ్ వెస్టావియా హిల్స్​సబర్బన్​లోని సెయింట్ ​స్టీఫెన్స్​ఎపిస్కోపల్​ చర్చిని టార్గెట్ ​చేసుకుని కాల్పులు జరిగాయి. గన్​తో చర్చిలోకి వెళ్లిన దుండగుడు అక్కడ ఉన్నవాళ్లపై ఫైరింగ్​ చేశాడు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. గురువారం సాయంత్రం 6.20 నిమిషాలకు తమకు ఫోన్​వచ్చిందని, అక్కడికెళ్లి సస్పెక్ట్​ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. గాయపడిన వ్యక్తిని హాస్పిటల్​లో చేర్చామని వివరించారు. చర్చిలో ప్రార్థనలు చేసేందుకు వచ్చిన వారికి ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు చెప్పారు.