సిద్దిపేటలో బాలింతకు కాన్పు చేసిన నర్సులు.. శిశువు మృతి

సిద్దిపేటలో బాలింతకు  కాన్పు చేసిన నర్సులు.. శిశువు మృతి

తెలంగాణలో ఈ మధ్య కాన్పులు  వికటించి బాలింత లేదా శిశువులు మృతి చెందుతున్న ఘటనలు  జరుగుతున్నాయి.   సరైన వైద్యం అందకపోవడం, డాక్టర్లకు బదులు నర్సులు వైద్యం చేయడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా  సిద్దిపేట జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. 

సిద్దిపేట జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన నవనీత పురిటి నొప్పులతో దుబ్బాక ప్రభుత్వ హాస్పిటల్ లో చేరింది. డ్యూటీ డాక్టర్లు విధులకు హాజరు కాకపోవడంతో స్టాఫ్ నర్సులే డెలివరీ చేశారు. డాక్టర్ లేకుండా నర్సులే ప్రసవం చేయడంతో  బిడ్డ మృతి చెందింది.

 వచ్చిరాని వైద్యం చేసిన నర్సుల నిర్లక్ష్యం వల్లే బిడ్డ చనిపోయిందని ఆరోపిస్తున్నారు బాధితురాలి కుటుంబ సభ్యులు. హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.