-in-Delhi-Police-Department_4DEoprib3K.jpg)
ఢిల్లీ పోలీస్ విభాగంలో కానిస్టేబుల్(డ్రైవర్) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్స్ కోరుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని అర్హతలున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం1411 పోస్టులు (జనరల్- 604, ఈడబ్ల్యూఎస్- 142, ఓబీసీ- 353, ఎస్సీ- 262, ఎస్టీ- 50) అందుబాటులో ఉన్నాయి.
అర్హత: ఇంటర్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు వాహనాల నిర్వహణపై అవగాహన ఉండాలి. వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
ఎగ్జామ్ ప్యాటర్న్: ఆబ్జెక్టివ్ టైప్‌లో 100 మార్కులు 100 ప్రశ్నలు అడుగుతారు. జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఇంటెలిజెన్స్, న్యూమరికల్ ఎబిలిటీ, రోడ్ సెన్స్, వెహికల్ మెయింటెనెన్స్, ట్రాఫిక్ రూల్స్/ సిగ్నల్స్ వెహికల్, పర్యావరణ కాలుష్యం తదితర అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
అప్లికేషన్స్ : అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో జూన్ 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు అక్టోబర్‌లో ఉంటాయి. పూర్తి వివరాలకు www.ssc.nic.in వెబ్సైట్ చూసుకోవాలి.
హెడ్ కానిస్టేబుల్స్
ఢిల్లీ పోలీసు విభాగంలో హెడ్ కానిస్టేబుల్ (అసిస్టెంట్ వైర్‌లెస్ ఆపరేటర్/ టెలీ-ప్రింటర్ ఆపరేటర్) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్స్ కోరుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని అర్హతలున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. హెడ్ కానిస్టేబుల్(ఏడబ్ల్యూవో/టీపీవో)- పురుషులు–573, మహిళలు–284.
అర్హత: 10+2(సీనియర్ సెకండరీ) సైన్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో లేదా మెకానిక్- కమ్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ సిస్టమ్ ట్రేడ్‌లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉత్తీర్ణత. కంప్యూటర్ ఆపరేషన్స్‌లో ప్రావీణ్యం ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, శారీరక దారుఢ్యం, మెజర్మెంట్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, ఇంగ్లిష్ వర్డ్ ప్రాసెసింగ్ టెస్ట్, బేసిక్ కంప్యూటర్ ఫంక్షన్ టెస్ట్ ఆధారంగా ఎంపిక .
దరఖాస్తులు: ఆన్లైన్లో జులై 29 వరకు అప్లై చేసుకోవచ్చు. సీబీటీ ఆధారిత పరీక్షలు అక్టోబర్‌లో నిర్వహిస్తారు. వివరాలకు www.ssc.nic.in వెబ్సైట్లో సంప్రదించాలి.