968 జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు... అప్లికేషన్ ఫీజు లేదు, రూ.35వేలు జీతం

968 జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు... అప్లికేషన్ ఫీజు లేదు, రూ.35వేలు జీతం

వివిధ కేంద్రప్రభుత్వరంగ సంస్థల్లోని జూనియర్‌ ఇంజనీర్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్  జారీచేసింది. దీంతో వివిధ కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లోని సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ జూనియర్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేస్తారు. సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవచ్చు. మార్చి 28న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 18 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఫీజు చెల్లించడానికి ఏప్రిల్ 19 వరకు గడువు ఉంది. రిజర్వేషన్ ప్రకారం పోస్టుల వారీగా అభ్యర్థులకు వయోపరిమితిని నిర్ణయించారు. కొన్ని విభాగాలకు 32 సంవత్సరాలు, మ‌రికొన్నింటికి 30 సంవత్సరాల వరకు గ‌రిష్ఠ వ‌యోప‌రిమితి నిర్ణయించారు.

 అప్లికేషన్ ఫీజు రూ.100 SBI బ్యాంక్ లో ఛలానా తీయాలి. మహిళలలు, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు లేదు. డిప్లొమా అభ్యర్థులకు 2 లేదా -3 సంవత్సరాల అనుభవం తప్పనిసరి. అయితే కొన్ని విభాగాల్లోని పోస్టులకు మాత్రమే అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. జూనియర్ ఇంజనీర్ ఎగ్జామినేషన్ రెండు దశల్లో నిర్వహిస్తారు. ఆన్‌లైన్ విధానంలోనే పరీక్షలు ఉంటాయి. ఫస్ట్ పేపర్ 1 ఆబ్జెటీవ్ టైప్ లో 200 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. సివిల్,ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాల నుంచి 100 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు. 0.25 నెగిటీవ్ మార్కులు ఉన్నాయి. ఇది క్వాలిఫై అయిన వారికే పేపర్ 2 నిర్వహిస్తారు. ఇందులో  300 మార్కులకు క్వశ్చన్ టూ ఆన్సర్ వ్యాసరూపంలో రాయాల్సి ఉంటుంది.