
కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీలో కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దేశంలోని అన్ని రాష్ట్రాల అభ్యర్థులు అర్హులే. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 15.
పోస్టుల సంఖ్య: 737. కానిస్టేబుల్ (డ్రైవర్).
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి సైన్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో 10+2 లేదా ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. హెవీ వెహికల్స్ డ్రైవింగ్ చేయగలిగే సామర్థ్యం ఉండాలి. అప్లికేషన్స్ గడువు ముగిసే నాటికి వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. వెహికల్ రిపేర్పై కనీస పరిజ్ఞానం ఉండాలి.
వయోపరిమితి: 21 నుంచి 30 ఏండ్ల మధ్యలో ఉండాలి. 1995, జులై 02వ తేదీ నాటి కంటే ముందు గానీ, 2004, జులై 01వ తేదీ తర్వాత గానీ జన్మించిన వారై ఉండరాదు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్లు ప్రారంభం: సెప్టెంబర్ 24.
లాస్ట్ డేట్: అక్టోబర్ 15.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ. 100.
సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎండ్యురెన్స్ అండ్ మెజర్మెంట్ టెస్ట్ (పీఈ అండ్ ఎంటీ), ట్రేడ్ టెస్ట్, మెడికల్ టెస్టు ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్: 2025 డిసెంబర్/ 2026, జనవరి.
పూర్తి వివరాలకు ssc.gov.in వెబ్సైట్లో సంప్రదించగలరు.
ఎగ్జామ్ ప్యాటర్న్ : కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించే ఎగ్జామ్లో మల్టిపుల్ చాయిస్ రూపంలో ప్రశ్నలు అడుగుతారు. క్వశ్చన్స్ ఇంగ్లిష్ లేదా హిందీ మాధ్యమంలో ఇస్తారు. మొత్తం 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. పార్ట్–ఏలో జనరల్ అవేర్నెస్ 20 ప్రశ్నలు 20 మార్కులకు, పార్ట్–బిలో జనరల్ ఇంటెలిజెన్స్ 20 ప్రశ్నలు 20 మార్కులకు, పార్ట్–సిలో న్యూమరికల్ ఎబిలిటీ 10 ప్రశ్నలు 10 మార్కులకు, పార్ట్–డిలో రోడ్ సెన్స్, వెహికల్ మెయింటెనెన్స్, ట్రాఫిక్ రూల్స్, పెట్రోల్ , డీజిల్ వెహికల్, శబ్ద, పర్యావరణ కాలుష్యాలపై 50 ప్రశ్నలు 50 మార్కులకు ఇస్తారు. నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.