గ్రాండ్‌గా అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు.. హాజరైన స్టార్ క్రికెటర్లు

గ్రాండ్‌గా అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు.. హాజరైన స్టార్ క్రికెటర్లు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ ఎడిషన్ ఇంకా ప్రారంభం కాకముందు స్టార్ క్రికెటర్లందరూ ఒక చోటు చేరారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ స్టార్లు మళ్లీ ఒక్కటయ్యారు. 

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, అతని భార్య సాక్షి ధోనీ, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, అతని కుటుంబం, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, సోదరుడు కృనాల్ పాండ్యా, మాజీ పేసర్ జహీర్ ఖాన్, భార్య సాగికా ఘాట్గే, సూర్యకుమార్ యాదవ్, అతని భార్య దేవిషా శెట్టి  ఈ వేడుకలకు హాజరయ్యారు. 

ALSO READ :- WPL 2024: బౌండరీ దగ్గర విన్యాసం..డివిలియర్స్‌ను గుర్తు చేసిన ఆర్సీబీ ప్లేయర్

భారతీయ క్రికెటర్లతో పాటు ఆఫ్ఘనిస్తాన్‌కు స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్, వెస్టిండీస్ బ్యాటర్ నికోలస్ పూరన్,ద్వైన్ బ్రావో వంటి విదేశీ ఆటగాళ్ళు ఈ వేడుకలకు వచ్చారు. వీరిలో ఒకరిద్దరూ మినహాయిస్తే అందరూ ముంబై ఇండియన్స్ గతంలో, ప్రస్తుతం ముంబై ఇండియన్స్ తరపున ఆడినవారే. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీగా ముఖేష్ కుమార్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 

ప్లేయర్లే మార్చి 1 నుంచి 3 వరకు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు ఆహ్వానించబడిన అతిథుల కోసం విస్తృతమైన మెనూ ప్లాన్ చేయబడింది. ఈవెంట్‌ల కోసం 25 మందికి పైగా చెఫ్‌లతో కూడిన ప్రత్యేక బృందం ఇండోర్ నుండి జామ్‌నగర్‌కు వెళ్లనున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి.

మూడు రోజుల వ్యవధిలో, మొత్తం 2,500 వంటకాలు మెనూలో ఉంటాయి. అల్పాహారంలో 70కి పైగా వెరైటీస్ ఉంటాయి. లంచ్ కోసం 250 వెరైటీస్, రాత్రి భోజనంలో 250 వెరైటీస్ ఉంటాయి. అతిథులకు శాకాహారి వంటకాల కోసం ప్రత్యేక సదుపాయం కూడా ఉంది. రాత్రి సమయంలో స్నాక్స్ కూడా అందించబడతాయి.