హైదరాబాద్, వెలుగు: స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.24 వేల కోట్ల ప్రీమియం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 2026 ఆర్థిక సంవత్సరంలో రూ.20,400 కోట్ల వ్యాపారం చేసినట్లు ఎండీ, సీఈఓ ఆనంద్ రాయ్ తెలిపారు. హైదరాబాద్లో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..2028 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.30 వేల కోట్లకు రెండు కొత్త బడ్జెట్ ప్లాన్లను త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. ‘‘ప్రస్తుతం కంపెనీ ఆదాయంలో 96 శాతం రిటైల్ రంగం నుంచే వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో గత ఏడాది రూ.2,268 కోట్ల ప్రీమియం వసూలయింది. ఈ రెండు రాష్ట్రాల నుంచి సంస్థకు 10 శాతం వ్యాపారం జరుగుతోంది. రాబోయే ఏళ్లలో దీన్ని 15 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం”అని ఆయన వివరించారు.
