
లాంగ్ హెయిర్, గుబురు గడ్డం, నల్ల కళ్ళద్దాలతో ఉన్న ఈ యాక్టర్ ఎవరో గుర్తుపట్టారా? ఆయన మరెవరో కాదు తమిళ స్టార్ హీరో ధనుష్. మరి ధనుష్ ఏంటి ఇలా మారిపోయాడు అనుకుంటున్నారా. అయన ప్రస్తుతం "కెప్టెన్ మిల్లర్" అనే సినిమా చేస్తున్నాడు. ఆరు మత్తేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ధనుష్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా కోసమే ధనుష్ ఈ కొత్త లుక్ లో కనిపించబోతున్నాడు.
గుబురు గడ్డం, లాంగ్ హెయిర్.. ఈ లోక్ చాలా కొత్తగా ఉంది. చాలా రోజుల నుండే ధనుష్ ఈ లుక్ ను మెయిన్టైన్ చేస్తున్నాడు. ధనుష్ ప్రీవియస్ మూవీ సార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఇదే లుక్ తో సందడి చేశాడు. ఇక తాజాగా ముంబై ఎయిర్పోర్ట్ లో ఈ సరికొత్త లుక్ లో కనిపించాడు. ఆ ఫోటోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా.. అది కాస్త క్షణాల్లో వైరల్ గా మారింది.
ఈ లుక్ చూసిన చాలామంది ధనుష్ ను గుర్తుపట్టలేదు. ఈ ఫోటో కింద అభిమానులందరూ.. భయ్యా ఇదేం లుక్కు.. సడెన్ గా చూసి రామ్ దేవ్ బాబా అనుకున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక కెప్టెన్ మిల్లర్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ జూన్ లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. మరి ఈ సినిమాతో ధనుష్ ఏ రేంజ్ లో అలరించనున్నాడో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.