Karthi Meiyazhagan: అన్నయ్య సూర్యతో కార్తీ మూవీ..'96’ డైరెక్ట‌ర్ ప్రేమ్‌కుమార్ నుంచి అదిరిపోయే అప్డేట్

Karthi Meiyazhagan: అన్నయ్య సూర్యతో కార్తీ మూవీ..'96’ డైరెక్ట‌ర్ ప్రేమ్‌కుమార్ నుంచి అదిరిపోయే అప్డేట్

చాలాకాలం తర్వాత కళ్లను దాటుకుని మనసు వరకు దూసుకెళ్లిన సినిమా ఏదైనా ఉంది అంటే..అది 96.అంతగా ఏముంది ఈ సినిమాలో! అది మాటల్లో చెప్పేది కాదు. చూసి అనుభూతి చెందాల్సిందే!

చిన్న వయసులో ప్రేమేంటి చోద్యం కాకపోతే అనే మాట నిజ జీవితంలో చాలాసార్లు వింటుంటాం, అంటుంటాం. కానీ ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకుని తడుముకుంటే..మనసు మూలల్లో ఎక్కడో దాచుకున్న చిన్ననాటి ప్రేమకథ ఒకటి ప్రతి ఒక్కరికీ తలుగుతుంది. 

స్కూల్లో పక్క బెంచీ అమ్మాయినో..ఊళ్లో వీధి చివరి అబ్బాయినో ప్రేమించిన జ్ఞాపకాల చెమ్మ  ఊపిరి ఆగేవరకు వరకు ఆరదు. ఆ విషయం అందరికీ తెలుసు. కానీ ఒప్పుకోరు,ఆ సంగతులు బైటికి చెప్పుకోరు. అలాంటి వారందరి మనసు తలుపుల్నీ తెరిచి ఆ కథలన్నింటినీ బైటికి లాగే ప్రయత్నం చేశాడు దర్శకుడు సి.ప్రేమ్‌ కుమార్. ఆ ప్రయత్నం పేరే..96.

తాజా విషయానికి వస్తే..తమిళ స్టార్ హీరో కార్తీ (Karthi) తెలుగువారికి కూడా సుపరిచితమైన హీరో.నేడు శనివారం (మే 25న)కార్తీ పుట్టినరోజు సందర్బంగా తన 27వ మూవీని ప్రకటించాడు. ఇందులో చాలా విభిన్నమైన విషయం ఏంటంటే కార్తీ హీరోగా నటించబోయేది..కుర్రాళ్ల ఫేవరేట్ డైరెక్టర్ అయిన ’96’ డైరెక్ట‌ర్ ప్రేమ్‌కుమార్ కాంబోలో.

అయితే ఈ సినిమాకు డైరెక్టర్ ప్రేమ్‌కుమార్ దర్శకత్వం వహించడమే కాకుండా..కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్‌లు కూడా అందిస్తుండటం విశేషం. అంతేకాదు ఈ సినిమా కథ రాసిందే కార్తీ కోసమని సమాచారం.ఇంతకు మునుపు విజయ్ సేతుపతిని హీరోగా ఎంచుకుని తీసిన ఆ మధురమైన 96 ఎలాంటి విజయం అందుకుందో మనం మనసారా ఆస్వాదించాం.ఇపుడు డైరెక్టర్ కలం నుండి రాబోతున్న కార్తీ 27వ మూవీకి సంబంధించిన టైటిల్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. 

ఈ సినిమాకు ‘మెయ్యళగన్’అనే  టైటిల్ ను ఫిక్స్ చేస్తూ..కార్తీ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను పంచుకున్నారు.ఈ పోస్టర్ లో కార్తీ సీనియర్ నటుడు అర‌వింద్ స్వామితో కలిసి ఉన్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటుంది. అరవింద్ స్వామి సైకిల్‌ను తొక్కుతుండగా..కార్తీ వెనుక కూర్చుని హాయిగా నవ్వుతున్నాడు.అలాగే మరో పోస్ట‌ర్‌లో కార్తీ ఎద్దును పట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా టైటిల్,ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ సోషల్ మీడియాలో వైర‌ల్‌ అవుతున్నాయి.త్వరలో ఈ సినిమాకి సంబంధించిన తెలుగు టైటిల్ కూడా మేకర్స్ రివీల్ చేయనున్నారు. 

కాగా ఈ సినిమాను 2డీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై హీరోయిన్ జ్యోతిక,సూర్య నిర్మిస్తుండటం విశేషం.రాజశేఖర్ కర్పూర సుందరపాండియన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.96 ఫేమ్ గోవింద్ వసంత సంగీతం అందిస్తున్నారు.త్వరలో ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది.