Priyanka Chopra: షూటింగ్లో ప్రమాదం.. స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు గాయాలు

Priyanka Chopra: షూటింగ్లో ప్రమాదం.. స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు గాయాలు

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా(Priyanka chopra)కు షూటింగ్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం ఆమెకు మొహానికి చేతులకు, కాళ్ళకి గాయాలు అయ్యాయి. గత కొంత కాలంగా ప్రియాంక హాలీవుడ్ లో మాత్రమే సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ది బ్లఫ్ అనే హాలీవుడ్ మూవీలో నటిస్తోంది. దర్శకుడు ఫ్రాంక్ E. ఫ్లవర్స్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతోంది. ఈ సినిమా కోసం ఓ యాక్షన్ సీన్ చిత్రీకరిస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.

ఇదే విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు ప్రియాంక. యాక్షన్ సీన్స్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు పోస్ట్ లో రాసుకొచ్చారు ప్రియాంక. ప్రియాంక చేసిన పోస్ట్ చూసిన ఆమె అభిమానులు కంగారుపడుతున్నారు. ప్రస్తుతం ప్రియాంక షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.