హైదరాబాద్: హైదరాబాద్ పికిల్‌బాల్ లీగ్ (హెచ్‌పీఎల్) మ్యాచ్‌లు రసవత్తరంగా సాగాయి. శనివారం జరిగిన మ్యాచ్‌ల్లో దాసోస్ డైనమోస్‌పై.. క్రెడికాన్ డైనమోస్ పైచేయి సాధించగా, కీర్తి వారియర్స్‌పై.. రాప్టర్స్ గెలిచింది.
స్టారీ స్మాషర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ది తెరమోర్ టైటాన్స్ విజయం సాధించింది. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ఏడు మ్యాచ్‌ల పోరులో నంది చార్జర్స్‌పై ఆల్ స్టార్స్ నెగ్గింది. దీంతో లీగ్ ప్లే ఆఫ్ రేస్ మరింత రక్తి కట్టింది. ఈ వీకెండ్ మ్యాచ్ ఫలితాలతో ప్లే ఆఫ్స్ నాలుగు బెర్త్‌ల కోసం అన్ని జట్లు బరిలో నిలిచాయి. దీంతో ఆఖరి రౌండ్ లీగ్ మ్యాచ్‌లపై ఫ్యాన్స్‌లో ఉత్కంఠ రెట్టింపైంది. ఈ వీకెండ్ మ్యాచ్‌లను బ్యాడ్మింటన్ స్టార్లు సాత్విక్, చిరాగ్, దర్శకుడు తరుణ్ భాస్కర్, మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వీక్షించారు.
